13 సెకండ్ల ముద్దు కోసం 13 నిమిషాల ప్రాక్టీస్
ఈ రోజుల్లో హీరోయిన్లు లిప్ కిస్ లు ఇచ్చి అభిమానులకు గుండె దడ పుట్టిస్తున్నారు. హీరోయిన్లు కిస్ లు ఇచ్చేది అభిమానులకు కాదు హీరోలకే అయినా తమకే ఇచ్చినట్టుగా అభిమానుల గుండెలు రసగంగలై పోతున్నాయి. సినిమాలలో ముద్దు సీన్లు కొత్తేం కాదు కానీ కాదల్ విజుందియన్ అనే తమిళ సినిమాలో ముద్దు మాత్రం సంచలనం కలిగించే రీతిలో ఉందిట. పివి ప్రసాద్ అనే కొత్త యువకుని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో నకులన్ క్యాంపస్ లో హీరోయిన్ ను పబ్లిక్ గా ముద్దు పెట్టుకునే సీన్ ఉందిట. ఈ సీన్ ను పాండిచ్చేరీ యూనివర్సిటీలో చిత్రీకరించారు. ఇలా పబ్లిక్ గా హీరోయిన్ ను ముద్దు పెట్టుకునే సీన్ లో నటించాలంటే నకులన్ నర్వస్ ఫీలయ్యాడట. అయితే హీరోయిన్ సునయన ప్రోత్సహించడంతో నకులన్ మొత్తానికి ముద్దు సీన్ లో నటించాడట.
ఇదేం సంచలనం కాదు కానీ...ఈ సీన్ కోసం హీరో టేకుల మీద టేకులు తినడమే సంచలనం. ఎన్నిసార్లు ముద్దు పెట్టినా దర్శకుడు సంతృప్తి చెందలేదట. దీనితో సొంత చెయ్యి మీద ముద్దుపెట్టుకుంటూ నకులన్ రిహార్సల్ చేశాడట. ఇది చూసి సునయన విపరీతంగా నవ్విందట. అంతే చెయ్యి మీద ముద్దెట్టుకొని రిహార్సల్ చేస్తే ఎలా ఆ పెట్టేదేదో నా పెదవులపైనే పెడుతూ ప్రాక్టీస్ చెయ్యమందట. దర్శకుడు కూడా అదే చెప్పాడట. ఇంకేముంది ఇద్దరూ చెట్లమాటుకు వెళ్లి ఎంచక్కా ముద్దు ప్రాక్టీస్ చేసాడట. కొద్ది నిమిషాల తరువాత ఫర్ ఫెక్ట్ గా ముద్దు పెట్టుకున్నాడట. పొదలచాటు నుంచి బయటకు వచ్చిన తరువాత ఒకే టేక్ లో ముద్దు సీన్ ఓకే అయిందట. ఈ సీన్ సినిమాకు ఎంతో ముఖ్యమైనదట. తన లవర్ నుంచి హీరో పొందే చివరి కిస్సట. అందుకే ఇంత ప్రాక్టీస్...తెరపై ఈ ముద్దు 13 సెకండ్లుంటుందట. ముద్దు సీన్ కోసం సునయన అందించిన సహకారం అద్బుతమని నకులన్ అంటున్నాడు. నకులన్ ఎవరో తెలుసా..బోయ్స్ సినిమాలో ఒక హీరో...హీరోయిన్ దేవయాని సొంత సోదరుడు.


Click it and Unblock the Notifications











