‘గబ్బర్‌సింగ్’ తిక్క డైలాగు వెనక అసలు కథ
హైదరాబాద్ :'నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది'ఇది 'గబ్బర్‌సింగ్' లో సూపర్ హిట్ డైలాగు. సినిమా ఎంత హిట్టయ్యిందో, ఈ డైలాగ్ అంతకన్నా పెద్ద హిట్టయ్యింది. ఇంతకీ ఈ తిక్క డైలాగు ఎలా దర్శక,రచయిత హరీష్ శంకర్ కి పుట్టింది...అంటే దానికో ఆసక్తికరమైన కథ ఉంది. ఈ డైలాగు వెనక ఉన్న కథను హరీష్ శంకర్ సాక్షి పేపరకు వివరించారు.
హరీష్ శంకర్ ఈ డైలాగు పుట్టిన విధం చెప్తూ...పొల్లాచ్చిలో 'గబ్బర్‌సింగ్' షెడ్యూలు మొదలైంది. అక్కడ్నుంచీ హైదరాబాద్ వెళ్లగానే ఓ టీజర్ రిలీజ్ చేయాలి. దర్శకుడు హరీష్‌శంకర్ ఆలోచనలో పడ్డారు. పవన్‌కల్యాణ్ సినిమా టీజర్ అంటే అల్లాటప్పాగా ఉండకూడదు. మంచి కిక్కిచ్చే డైలాగు పడాలి. ఇంతలో హరీష్‌శంకర్ మైండ్‌లో ఏదో తళుక్కుమంది. చకచకా ఆ డైలాగు పేపర్ మీద పెట్టేశారు. 'నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది'. ఇదీ డైలాగ్. పవన్‌కల్యాణ్ ఒప్పు కుంటారా? ఒకింత సందేహపడుతూనే ఆయన ఉన్న కేరవాన్‌లోకి వెళ్లారు
హరీష్‌శంకర్. ఈ డైలాగ్ వినగానే పవన్‌కల్యాణ్ చిన్నపిల్లాడిలా చప్పట్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేశారు. ''నాపై ఎందుకు రాయాలనిపించిందీ డైలాగ్' అనడిగారాయన. ''సార్... మీకు బాగా తిక్క అని చాలామందిలో ఓ అపప్రద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది రాశా... దానికి తోడు 'గబ్బర్‌సింగ్' కేరెక్టర్‌కి ఇది ఫుల్ యాప్ట్'' అని జవాబిచ్చారు హరీష్‌శంకర్.
హరీష్ శంకర్ మాట్లాడుతూ...''పవన్ తిక్క మనిషని, ఎవ్వరి మాటా వినరని అందరూ అనుకుంటారు. ఆయనను కలిశాక అవన్నీ వట్టి భ్రమలని అర్థమైంది. మీడియాకు, చాలామందికి దూరంగా ఉంటారు కాబట్టి ఆయనపై ఈ బ్రాండ్ పడింది కానీ, ఆయనలో ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ ఎవ్వరిలోనూ ఉండదు. ఆయన్ను ఉద్దేశించి ఈ డైలాగ్ రాస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ధైర్యంతోనే ''నేను ట్రెండ్ ఫాలోకాను. సెట్ చేస్తా'', ''నాకెవ్వరూ పోటీ కాదు. నాకు నేనే పోటీ''లాంటి డైలాగ్స్ రాశా'' అన్నారు.


Click it and Unblock the Notifications











