twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజినీకాంత్ కీ ఆ పూరి గుడిసెతో ఉన్న అనుబందం ఏమిటీ? ఇప్పటికీ అందులోనే

    రజినీకాంత్ ఇంటి మీద ఒక పూరిగుడిసెలా కనిపించే ఆ కట్టడం గురించిన ఇంట్రస్టింగ్ స్టోరీ ఇలాఉంది...

    |

    దాదాపు పన్నెండేళ్ళ తర్వాత అభిమానులతో సూపర్ స్టార్ రజినీ మీటింగ్ అద్బుతంగా జరిగింది. తాము దేవుడు గా భావించే తలైవా ని చూడటానికి వచ్చిన అభిమానుల ఆనందపు కేరింతలతో ఆ ప్రాంగనం అంతా దద్దరిలీ పోయింది. ఫ్యాన్స్ పట్ల తనకున్న ప్రేమనీ, తనను గుండెల్లో దాచుకున్న వారి అభిమానానికీ రజినీ ఎంతో ఆప్యాయంగా, ఉద్వగంగా మాట్లాడిన మాటలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి...

    ఫొటోసెషన్‌ కార్యక్రమం

    ఫొటోసెషన్‌ కార్యక్రమం

    ‘నన్నుబతికించుకుంటున్న అభిమానులందరికీ నా వందనాలు' అని రజనీకాంత్‌ నోటి నుంచి వచ్చిన పలుకులతో ఆ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. వారి కోలాహలం నడుమ తనతో ఫొటోలు దిగాలన్న అభిమానుల కోరికను తీర్చేందుకు రజనీ కాంత్‌ తలపెట్టిన ఫొటోసెషన్‌ కార్యక్రమం సోమవారం అభిమానుల కోలాహలం నడుమ ఎంతో ఘనంగా ఆరంభమైంది.

    రాఘవేంద్ర కల్యాణ మండపం

    రాఘవేంద్ర కల్యాణ మండపం

    స్థానిక కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మంటపంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. తొలిరోజున దిండుగల్‌, కన్నియకుమారి, కరూర్‌ జిల్లాలకు చెందిన 750 మంది అభిమానులు రజనీకాంత్‌తో ఫొటోలు దిగారు. ఈ ఫొటోసెషన్‌ నిర్వహణకు కారకులైన దర్శక దిగ్గజం, రజనీకి అత్యంత సన్నిహితులైన ఎస్పీ ముత్తురామన్‌... సూపర్‌ స్టార్‌ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

    పెంట్ హౌస్

    పెంట్ హౌస్

    అయితే ఈ సభ అంతా ఒక ఎత్తయితే ఆయన ఇంటిపైన ఉన్న పెంట్ హౌస్ మరో ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ఒక పూరిగుడిసెలా కనిపించే ఆ కట్టడం అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ విషయమేమిటో తెలుసుకోవాలని చాలామంది అనుకున్నారు. దానికి సమాధానం కూడా ముత్తురామన్ చెప్పుకొచ్చారు.

     పూరిల్లు

    పూరిల్లు

    ముత్తురామన్‌ మాట్లాడుతూనే రజినీ ఇంటిమీద ఉన్న పూరిల్లు లాంటి నిర్మాణాన్ని చూపిస్తూ... ఇండియాకే సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగినా కూడా ఎప్పుడూ అహంకారం దరిచేరనివ్వలేదు. మేమిద్దరం కలిసిన మొదటిరోజు నాతో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు.

     గుడిసెలో ఉండేవారు

    గుడిసెలో ఉండేవారు

    ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న సమయంలో చెన్నైలో కొంతమంది స్నేహితులతో కలిసి ఒక గుడిసెలో ఉండేవారు. ఇప్పుడు ఆయన భవంతిలో పైన అలాంటి గుడిసె కట్టించారు. ఎందుకు అనడిగితే... మనం వచ్చిన స్థలం ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పాడు. దటీజ్ రజినీ కాంత్ అంటూ చెప్పాడు...

    English summary
    Tamil Director SP Mutthuraman sahred A Story about a hut on Rajinikanth's house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X