twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ""హీరోలకన్నా కథే మిన్న""

    By Staff
    |

    చక్కని కథ, దానిని అద్భుతంగా తెరకెక్కించడమే అన్నిటికన్నా ముఖ్యమని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంటున్నారు. ఈ రెండు సరిగా ఉంటే టెక్నిక్స్ తో పనిలేదని ఆయన అంటున్నాడు. కథ కోసమే ప్రేక్షకులు సినిమాకు వస్తారు కానీ మరే విషయాలు పట్టించుకోరని అంటున్నారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చిన మణిరత్నం మీడియాతో మాట్లాడారు. కథను కన్విన్సింగ్ గా చెప్పడమే తనకు చాలా ముఖ్యవిషయమని, అందుకు తగినట్టుగా నటీనటుల నటన అవసరమని, మంచి కథ ఉన్నా నటులు న్యాయం చేయకపోతే వృథా అవుతుందని అంటున్నారు. అయినా నటుల కన్నా కథే మిన్న అని ఆయన స్పష్టం చేశారు. నాయకుడు, రోజా, బొంబాయి, దిల్ సే, దళపతి, అంజలి, యువ, గురు తదితర సినిమాలు చేసిన మణిరత్నం మాట్లాడుతూ...ఎవరైనా కథ రాస్తున్నారంటే ప్రస్తుత స్థితి గతులను పరిగణనలోకి తీసుకోవాలి...అపుడే చక్కని కథలు రూపొందుతాయి...అపుడే ప్రేక్షకులు సినిమా తమకు సంబంధించినదిగా భావిస్తారు...నేను ఇళయరాజా, రహమాన్ తో పనిచేశాను...ఇద్దరూ అద్భుత కంపోజర్లు...ఇద్దరి బాణీ వేరు. ఇళయరాజా చాలా వేగంగా కంపోజ్ చేస్తే, రహమాన్ సమయం తీసుకుంటాడు...ఆలోచిస్తాడు...అని అన్నాడు మణిరత్నం.

    Read more about: mani ratnam telugu movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X