twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కల్యాణ్‌రామ్‌ 'ఓమ్‌' కథేమిటి ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంత కాలం నుంచి త్రీడి చిత్రం 'ఓమ్‌' తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై త్రీడీ స్టీరియోఫోనిక్‌ విధానంలో 'ఓం' చిత్రాన్ని తానే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఛాయాగ్రాహకుడు సునీల్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్ . చిత్రం షూటింగ్ కు ఎంతో సమయం,నిర్మాణ వ్యయం తీసుకున్న ఈ చిత్రం కథపై అందరికీ ఆసక్తే. ఈ విషయం గురించి కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడారు.

    కళ్యాణ్ రామ్ మాటల్లోనే...''ఓ యువకుడు తనకు ఎదురైన అనుభవాల మూలంగా ఎలా మారాడు? ఎవరిపై విజయం సాధించాలని తపించాడు? అందుకోసం ఎంచుకొన్న మార్గం ఏమిటన్నది తెరపైనే చూడాలి. కథాంశంలో మన ప్రేక్షకులకు నచ్చే వినోదం, భావోద్వేగాలు, ప్రేమ ఘట్టాలూ ఉంటాయి. ''అన్నారు.

    అలాగే కథతోపాటు చూపించే విధానమూ కొత్తగా ఉండాలి. అందుకే మా చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించాం. ఫైట్స్ విస్మయం కలిగిస్తాయి. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు మన దేశంతోపాటు సింగపూర్‌, అమెరికాల్లో సాగుతున్నాయి. .స్టీరియో ఫోనిక్‌ విధానంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా విదేశాల నుంచి కెమెరాలు, లెన్స్‌లు తెప్పించాం అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌.

    కళ్యాణ్ రామ్ ...ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆయన నిర్మిస్తూ నటిస్తున్న త్రీడీ చిత్రం 'ఓమ్‌'. ఈ నెల మూడో వారంలో పాటల్ని, వచ్చే నెలలో సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

    English summary
    
 Kalyan Ram’s upcoming high budget 3D Movie "OM" audio will be released in this month. It is being directed by Sunil Reddy. Nikesha Patel and Kriti Kharbanda are playing the female lead roles opposite Kalyan Ram in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X