Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కల్యాణ్‌రామ్ 'ఓమ్' కథేమిటి ?
కళ్యాణ్ రామ్ మాటల్లోనే...''ఓ యువకుడు తనకు ఎదురైన అనుభవాల మూలంగా ఎలా మారాడు? ఎవరిపై విజయం సాధించాలని తపించాడు? అందుకోసం ఎంచుకొన్న మార్గం ఏమిటన్నది తెరపైనే చూడాలి. కథాంశంలో మన ప్రేక్షకులకు నచ్చే వినోదం, భావోద్వేగాలు, ప్రేమ ఘట్టాలూ ఉంటాయి. ''అన్నారు.
అలాగే కథతోపాటు చూపించే విధానమూ కొత్తగా ఉండాలి. అందుకే మా చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించాం. ఫైట్స్ విస్మయం కలిగిస్తాయి. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు మన దేశంతోపాటు సింగపూర్, అమెరికాల్లో సాగుతున్నాయి. .స్టీరియో ఫోనిక్ విధానంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా విదేశాల నుంచి కెమెరాలు, లెన్స్‌లు తెప్పించాం అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్.
కళ్యాణ్ రామ్ ...ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మిస్తూ నటిస్తున్న త్రీడీ చిత్రం 'ఓమ్'. ఈ నెల మూడో వారంలో పాటల్ని, వచ్చే నెలలో సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్, స్టీరియోగ్రాఫర్స్: డేవిడ్ మైక్‌టేలర్, మార్కస్, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్: విజయ్, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్.