సర్కార్ రాజ్ ఏం చేస్తాడు?

ఇక సర్కార్ రాజ్ కథ విషయానికొస్తే... ఐశ్వర్యారాయ్ ఓ అంతర్జాతీయ కంపెనీకి సీఈఓ. ఆమె మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో విద్యుత్ ప్లాంట్ నెలకొల్పాలనుకుంటుంది. అయితే అక్కడ ప్రాంతాలకు పెద్ద అయిన అమితాబ్ బచ్చన్ గట్టిగా వ్యతిరేకిస్తాడు. చివరగా ప్రాజెక్ట్ ఉపయోగాలు దాని వల్ల తమ గ్రామాలు బాగుపడే తీరు తెలుసుకుంటాడు. ఐష్ కి మద్దతు తెలుపుతాడు. సమస్య తీరిపోయిందనుకుని పనులు ప్రారంభించే సమయంలో అక్కడ రాజకీయాలు ప్రారంభమవుతాయి. దీంతో కథ అనుకోని మలుపు తిరిగి రసవత్తరంగా ముందుకు సాగుతుంది. చివరికి పవర్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏమైంది అనేది ఉత్కంఠతో తీర్చిదిద్దారట వర్మ. దాంతో సర్కార్ తరహాలోనే ఈ చిత్రం కాసుల వర్షాన్ని కుర్పిస్తుందని భావిస్తూ జూన్ ఆరున చిత్రం రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











