ఆ థ్రిల్లర్ కథేంటి

ఈ సినిమా కథ పదమూడు పాత్రలతో మొదలవుతుంది. వారు కథా గమనంలో ఒకరు తరువాత మరొకరు చనిపోయి చివరకి వారిలో ముగ్గురు మిగిలుతారు. వారే 'త్రీ"(రిషి, రాజీవ్ కనకాల ,శాంతిచంద్ర అనే నూతన నటుడు ). వారు ఎదుర్కొనే ఆ ప్రమాదమేమిటి వారు మాత్రం ఎలా తప్పించుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ . అదే ప్రేక్షకుల్లో టెన్షన్ కలిగిస్తుంది. అందుకే ఈ సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్‌గా చెప్పొచ్చని శేఖర్ చెపుతున్నాడు. ట్రైలర్ల విడుదలైన ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అప్పటి దాకా ఈ సస్పన్స్ భరించకతప్పదు.


Click it and Unblock the Notifications











