For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేల ఏళ్లకిందటి ప్రేమ కథ... మొహంజో దారో ఇంత అద్బుతమా...!? (ఫొటోలు)

|

భారతదేశ చరిత్ర క్రీ .పూ. 34 వేల ఏళ్ల కిందట హోమోసెఫియన్ల కాలం నుంచి ప్రారంభమైనట్లు చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశ చరిత్ర అంటే భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌తో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర లో హరప్పా...మొహంజో దారోలకి విశిష్టమైన స్థానం ఉంది.

వేల ఏళ్ల కిందట అప్పటికి క్రీస్తూ పుట్టలేదు...బుద్దుడు కన్నైనా తెరవలేదు... ఆనాటికే మొహంజోదారో ఒక గొప్ప నాగరికత విలసిల్లిన ప్రదేశం. హరప్పా, మొహంజోదారో ప్రదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. హరప్పా నగరంలో ధాన్యాగార భవనం ఒక విశిష్ట నిర్మాణం....వేల సంవత్సరాలు గడిచిపోయాయి...వందల చరిత్రలూ కాలం లో కలిసి పోయాయి... మొహంజో దారో ఒక చరిత్ర పాఠమైపోయింది... క్రీ.పూ 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం ఆరంభించింది. క్రీ.పూ 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలూ పాడుబడిపోయాయి. కానీ సింధూ లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తరువాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి.....

అయితే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మొహంజోదారో మనముందుకు వచ్చింది. చారిత్రక అంశాలతో పాటు అందమైన ప్రేమకథను కూడా కలుపుకోని నిర్మించబడ్డ "మొహంజోదారో" రేపు విడుదల కానుంది.. ఈ సందర్భం లో మొహంజో దారో గురించీ... హృతిక్ రోషన్ గురించీ, ఆ సినిమా గురించీ కొన్ని సంగతులు.... స్లైడ్ షోలో....

తామ్ర శిలాయుగం

రాగి లోహం వాడుకతో ఈ యుగం ప్రారంభమైనందువల్ల దీన్ని ‘తామ్ర శిలాయుగం'గా పేర్కొంటారు. దీన్ని ‘హరప్పా సంస్కృతి' అని కూడా అంటారు. 1921లో సింధూ మైదాన ప్రాంతంలో చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో హరప్పా ప్రదేశం బయల్పడింది. అందువల్ల దీన్ని ‘సింధూ నాగరికత' లేదా ‘హరప్పా నాగరికత'గా వ్యవహరించారు.

పాకిస్తాన్‌లో ఉన్నాయి

హరప్పా, మొహంజోదారో ప్రదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. హరప్పా నగరంలో ధాన్యాగార భవనం ఒక విశిష్ట నిర్మాణం. మొహంజోదారోలో బయల్పడిన స్నానవాటిక ప్రసిద్ధి చెందింది. చాన్హుదారో కోటలకు ఖ్యాతి చెందింది. గుజరాత్‌లోని లోథాల్ ప్రసిద్ధ రేవు పట్టణం.

మొహంజోదారో

దేశ, విదేశీ (మెసపటోమియా ప్రజలతో) వాణిజ్యం చేశారు. రాజస్థాన్‌లోని కాళీభంగన్, హరియాణాలోని బన్వాలి కూడా ఈ నాగరికతకు చెందిన ముఖ్యమైన ప్రదేశాలు. సింధూ స్థావరాల్లో రాఖీగర్హిని అతి పెద్ద నగరంగా 2014లో పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతకుముందు వరకు మొహంజోదారోను పెద్ద నగరంగా పరిగణించేవారు.

హోమోసెఫియన్ల కాలం నుంచి

భారతదేశ చరిత్ర క్రీ .పూ. 34 వేల ఏళ్ల కిందట హోమోసెఫియన్ల కాలం నుంచి ప్రారంభమైనట్లు చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశ చరిత్ర అంటే భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌తో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర లో హరప్పా...మొహంజో దారోలకి విశిష్టమైన స్థానం ఉంది.

క్రీస్తు కంటే ముందు:

బ్రిటిష్ పాలనకటే ముందు, మొగలాయిల కంటే ముందు, క్రీస్తు కంటే ముందు, అలెగ్జాండర్ రాక కంటే ముందు, బుద్దుడి కంటే ముందు....ఇండియాలో మొహంజోదారో నాగరికత విలసిల్లింది...

వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు:

వేల సంవత్సరాలు గడిచిపోయాయి...వందల చరిత్రలూ కాలం లో కలిసి పోయాయి... మొహంజో దారో ఒక చరిత్ర పాఠమైపోయింది... అయితే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మొహంజోదారో మనముందుకు వచ్చింది. చారిత్రక అంశాలతో పాటు అందమైన ప్రేమకథను కూడా కలుపుకోని నిర్మించబడ్డ "మొహంజోదారో" రేపు విడుదల కానుంది..

అశుతోష్‌:

మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తి అక్బర్‌, జోధాల ప్రణయగాథను ‘జోధా అక్బర్‌'లో రసరమ్యంగా ఆవిష్కరించాడు అశుతోష్‌. ఆ చిత్రంతో హృతిక్‌, అశుతోష్‌ కలయికకు మంచి పేరొచ్చింది. ఈ కలయికలో మరో చారిత్రక నేపథ్య చిత్రంగా ‘మొహెంజొ దారో' వస్తోంది.

ప్రేమకథగా:

రెండు వేల ఏళ్లకు పూర్వం సింధు నాగరికత కాలంలో జరిగే ఓ అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అశుతోష్‌.

శర్మాన్‌, చాని:

ఈ చిత్రంలో శర్మాన్‌, చాని అనే ప్రేమజంటగా హృతిక్‌, పూజా కనిపించనున్నారు. ఇందులో వారి గెటప్‌లు, ట్రైలర్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఎ.ఆర్‌.రెహమాన్‌:

ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. దానికి అనుగుణంగానే ప్రి రిలీజ్‌ బిజినెస్‌తో ఈ చిత్రం సత్తా చాటుతోంది.

60 కోట్లు ఆదాయం:

శాటిలైట్‌ హక్కులకు రూ.45 కోట్లు, పాటలు, ఇతర హక్కుల రూపంలో రూ.15 కోట్లతో మొత్తంగా రూ.60 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న లొకార్నో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది ఈ చిత్రం.

గుజరాత్‌లోని భుజ్‌లో :

ఈ చిత్రం కోసం మొహెంజొ దారో నగర సెట్‌ను గుజరాత్‌లోని భుజ్‌లో నిర్మించారు. అశుతోష్‌ తెరకెక్కించిన ‘లగాన్‌' చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగింది. మొహెంజొ దారో నగర పౌరులుగా తెరపై కనిపించే వారంతా భుజ్‌ పరిసర ప్రాంత ప్రజలేనట.

రెండు సార్లు గాయపడ్డాడు.:

ఇందులో హృతిక్‌ పులులతో పోరాడే సన్నివేశం కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. శిక్షన సమయం లో పులులవల్ల హృతిక్‌ రెండు సార్లు గాయపడ్డాడు.

300 మంది:

ఏడడుగుల పొడవున్న ఇద్దరు బలశాలులతో హృతిక్ పోరాడే ఒక సన్ని వేశం లో కనిపించాల్సిన ఆ ఇద్దరి పాత్రల కోసం సుమారు 300 మందికి ఆడిషన్స్‌ నిర్వహించి ఇద్దరిని ఎంపిక చేసుకున్నారు.

పూజా హెగ్డే:

పూజా హెగ్డేకు బాలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. హృతిక్‌ లాంటి అగ్రకథానాయకుడి సరసన ఓ భారీ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమవడంపై ఆనందం వ్యక్తం చేసింది పూజా.

నిడివి:

అశుతోష్‌ తెరకెక్కించిన అన్ని చిత్రాలు మూడు గంటలకు పైనే నిడివి ఉంటాయి. ‘మొహెంజొ దారో' నిడివి మాత్రం 2 గంటల 30 నిమిషాలు. అశుతోష్‌ చిత్రాల్లో ఇదే చిన్న సినిమా.

అందరి దృష్టినీ తనవైపుకు:

తెలుగులో ‘ముకుంద', ‘ఒక లైలా కోసం' చిత్రాల్లో నాయికగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కన్నడ భామ పూజా హెగ్డే బాలీవుడ్‌లో ‘మొహంజో దారో' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తుండటం ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంది.

ఊహించనిదే:

బాలీవుడ్‌లో తొలి చిత్రంలోనే హృతిక్‌ రోషన్ వంటి సూపర్‌స్టార్‌ సరసన, అశుతోష్‌ గోవరికర్‌ వంటి పేరుపొందిన దర్శకుడితో పనిచేసే అవకాశం రావడం అనూహ్యమే.

కల నిజమైనట్లుగా ఉంది:

అదృష్టవంతురాలుగా: అందుకే ‘‘హృతిక్‌, అశుతోష్‌ వంటి లెజెండ్స్‌తో పనిచేయడంతో నేనెంతో అదృష్టవంతురాలినని ఫీలవుతున్నా. బాలీవుడ్‌లో తొలి చిత్రంలోనే హృతిక్‌తో చేయడం కల నిజమైనట్లుగా ఉంది'' అంటోంది.

వేల ఏళ్లకిందటి ప్రేమ కథ... మొహంజో దారో ఇంత అద్బుతమా...!? (ఫొటోలు)

స్కూలు రోజుల్లో మొహంజో దారో గురించి చదువుకున్న తాను ఆ కథతో తీసే సినిమాలో నటించే సినిమాలో నటిస్తానని కలలో కూడా ఊహించుకోలేదని తెలిపింది పూజ.

విశేషమైన స్పందన:

ఆ సినిమా కోసం విడుదల చేసిన పూజ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. అలాగే యూట్యూబ్‌లో విడుదల చేసిన ‘తూ హై' సాంగ్‌ టీజర్‌కు వారం రోజుల్లో 35 లక్షలకు పైగా వ్యూస్‌ రావడం గమనార్హం.

English summary
Bolly wood movie Mohenjo daro directed by Ashutosh Gowarikar releasing on August 12, 2016, Hritik Roshan playing as Hero
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more