యష్ రామాయాణం.. మరో ఆదిపురుష్ అవుతుందా? అలా కథ చెబితే ఒప్పుకుంటారా?

By Lekhaka

'రామాయణం'పై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రణబీర్ కపూర్ రాముడిగా మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా రామాయణం కథతో సినిమా అనగానే కొత్తగా ఏం చూపించబోతున్నారు అనేదే అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఎందుకంటే ప్రతి హిందువు చిన్నప్పటి నుంచే రామాయణం గురించి కథల రూపంలో వినడం, చదవడం, తెలుసుకోవడం జరుగుతుంది. మరి అలా అల్మోస్ట్ అందరికీ తెలిసిన కథనే తెరపైకి తీసుకురావడంలో అర్థం ఏముంటుంది? అందుకే యష్ హిందీ రామాయణంతో కొత్తగా ట్రై చేస్తున్నాడట. కానీ యష్ ప్రయత్నాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

హిందీలో రామాయణం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి నటిస్తోంది. రాముడు-సీత పాత్రలో మెకోవర్ అయిన రణబీర్, సాయి పల్లవి ఫోటోలు కొన్ని ఇప్పటికే లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రలో నటిస్తాడని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటి వరకు బయటకు రాలేదు.

story narration will be in the Ravana point of view

కానీ ఇప్పుడు ఈ వార్త అఫీషియల్. అంతే కాదు ఈ సినిమాలో హీరో యష్ అనే సమాచారాన్ని అందులో కీలక పాత్రను పోసిస్తున్న ఓ నటుడు బయటపెట్టారు. రామాయణం సినిమాలో నటిస్తున్న ప్రముఖ నటుడు ఆదిత్య దేశ్‌ముఖ్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ యష్‌ ఈ సినిమాలో రావణుడి పాత్ర పోషిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. పైగా ఇప్పుడు నిర్మిస్తున్న రామాయణం సినిమాను రాముడి కోణంలో కాకుండా రావణుడి కోణంలో చెప్పనున్నారనే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ను ఆయన లీక్ చేశారు.

అంటే ఇప్పుడు రూపొందుతున్న రామాయణంలో రావణుడు 'విలన్' మాత్రమే కాదు, మొత్తం రామాయణాన్ని రావణుడి కోణంలోనే ప్రేక్షకులకు చూపించనున్నారు మేకర్స్. అయితే నిజానికి రామాయణం అనగానే రాముడే హీరో అనుకుంటారు. అయితే ఈ సినిమాలో మాత్రం రావణుడి పాత్రకు మంచి స్కోప్ ఉండడంతో యష్ ను ఆ పాత్రకు ఎంపిక చేశారని మొదటి నుంచి టాక్ విన్పిస్తోంది. ఇప్పుడు అదే నిజమైంది.

కానీ మేకర్స్ కు ఇదో సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పవచ్చు. ఎందుకంటే భారతీయులు రాముడిని మాత్రమే హీరోగా, దేవుడిగా ఎన్నో తరాల నుంచి కొలుస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా రావణుడి దృష్టి నుంచి చూడడం, లేదా రావణుడిని మెయిన్ గా హైలెట్ చేయడం అనేది సినిమా రిలీజ్ టైమ్ లో సమస్యగా మారుతుంది. మరి ప్రేక్షకులను కన్విన్స్ చేసే పాయింట్ మేకర్స్ దగ్గర ఉంటే తప్ప జనాలు దీన్ని యాక్సెప్ట్ చేయరు.

'రామాయణం' సినిమాకి మధు మంతెన, అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా యష్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్‌లతో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రామాయణం' సినిమాతో పాటు యష్ తన 'టాక్సిక్' సినిమా షూటింగ్‌లో కూడా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కూడా 2025లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Read more about: ramayana yash sai pallavi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X