ఆర్పీ పట్నాయక్ 'ఫ్రెండ్స్ బుక్' కథేంటి?
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ "ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని కొత్త పాయింట్‌తో, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించా. ప్రేక్షకుల్ని ఎక్కడా అసంతృప్తికి గురిచెయ్యని సినిమా. తొలికాపీ చూసినవెంటనే నిర్మాత విజయప్రసాద్ ఐదు నిమిషాల సేపు షేక్‌హేండ్ ఇచ్చి, గంటసేపు అభినందిస్తూ మాట్లాడారు. నటులు కొత్తవాళ్లయినా పరిణతి చెందిన నటన ప్రదర్శించారు. రావు రమేశ్ పాత్ర అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలో పాటలకు అవకాశం లేదు. అందువల్ల ఒక్క పాటే ఉంటుంది. వేసవి సెలవుల్ని 'ఫ్రెండ్స్‌బుక్'తో ప్రేక్షకులు ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.
ఇక ఈ కథకు స్ఫూర్తినిచ్చిన విషయాలేమిటి అని ఆర్పీని మీడియావారు అడిగినప్పుడు... ఫేస్‌బుక్‌లో ఒక స్నేహితుడి తాలూకు పేజ్‌లోకి వెళ్లినప్పుడు... అక్కడ ఇంకో పేజ్ తగిలింది. అరగంటపాటు అందులోని విషయాల్ని గమనించాను. అప్పుడు కలిగిన భావోద్వేగాలే ఈ కథకు మూలం. ఇక ఈ చిత్రంలో ఆయా పాత్రలకు, వయసుకు తగ్గట్టుగా నటీనటుల్ని ఎంచుకొన్నాను అన్నారు. అలాగే తాను ఈ చిత్రంలో నటించటం లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయమై చెప్తూ..నాకు ఇష్టమని నేనెప్పుడూ తెరపై కనిపించలేదు. ఆయా కథలకీ, పాత్రలకి నేను సరిపోతాను అనుకొన్నాను కాబట్టే నటించానంతే. 'శీను వాసంతి లక్ష్మీ' తరవాత ఏడేళ్లకు 'బ్రోకర్'లో నటించాను అన్నారు.
ఇక ఈ చిత్రానకి మొదట ఫేస్ బుక్ అనే టైటిల్ పెట్టారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ని ఇలా మార్చారు. రేపు విడుదల అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆర్పీ పట్నాయక్ సైతం ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రం విడుదల అయ్యాక వరసగా సినిమాలు డైరక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై మళ్ల విజయప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిశ్చల్, ఉదయ్, సూర్య ప్రధాన పాత్రధారులు.


Click it and Unblock the Notifications












