బాంబ్ బ్లాస్ట్ లో అనూష్క...(శివతాండవం కథ)
హైదరాబాద్ : విక్రమ్, జగపతిబాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్ దర్శ కత్వంలో సి.కళ్యాణ్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. అనూష్క హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 5 న విడదల అవుతోంది. తమిళంలో ఆల్రెడీ తాండవం పేరున క్రితం వారం విడుదలైంది. ఈ చిత్రంలో విక్రమ్ ఓ ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే ఈ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్ కనిపించటం.
కథ ప్రకారం ఈ చిత్రంలో శివ కుమార్ గా విక్రమ్ కనపడతారు. అతను ఇండియాలోని బెస్ట్ రా ఏజెంట్ లలో ఒకరు. హ్యాపీగా మీనాక్షి(అనూష్క)తో మ్యారేడ్ లైఫ్ గడుపూతూంటాడు. ఆమె ఓ ఆప్తమాలజిస్ట్...ఎంతో మంది గుడ్డి వాళ్లకి ఆమె తన ఫౌండేషన్ ద్వారా వెలుగు చూపిస్తూంటుంది. శివకి బెస్ట్ ప్రెండ్ శరత్(జగపతిబాబు). అతను రా లోనే విక్రమ్ తర్వాత బెస్ట్ ఆఫీసర్ గా చేస్తూంటాడు. నేషనల్ సెక్యూరటీకి చెందిన ఓ కేసులో అనుమానితుడ్ని ఇంటరాగేట్ చేస్తూండగా అతనిపై దాడి జరిగి హాస్పటిల్ లో చేరతాడు. అక్కడినుంచి కథ మలుపుతిరుగుతుంది.
తన స్నేహితుడు పై దాడి జరిపిన వారి అంతు తేల్చడానికి, ఆ కేసు హ్యాండోవర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ నిమిత్తం లండన్ వెళ్లి ఊహించని విధంగా కళ్లు పోగొట్టుకుంటాడు. అప్పుడు తాను ట్రాప్ కి గురి అయ్యానని తెలుసుకుంటాడు. అతన్ని ట్రాప్ చేసింది మరెవరో కాదు టెర్రరిస్టులతో చేతులు కలిపిన శరత్. ఇండియన్ మిలిట్రీకి చెందిన ఓ కాన్ఫిడెన్సియల్ మ్యాటర్ ని టెర్రరిస్టులకు అమ్మాలని అతని ప్లాన్. ఈ లోగా తన భర్త శివ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్దామని లండన్ లో ల్యాండ్ అవుతుంది మీనాక్షి(అనుష్క). అయితే ఆమెని సైతం బాంబ్ బ్లాస్ట్ లో చంపేస్తారు. అప్పుడు తన భార్యని చంపి,తనని గుడ్డివారిని చేసి,దేశ రహస్యాలను అమ్మాలనుకునేవారికి గుడ్డి వాడైన శివ ఎలా బుద్ది చెప్పాడు అనేది మిగతా కథ.
అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు . జి.విపకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు. షాయాజీ షిండే, నాజర్, కోట శ్రీనివాసరావు, శంతనమ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. విక్రమ్‌కి సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క, యామీ జాక్సన్, లక్ష్మీరాయ్, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్, ఢిల్లి గణేష్ ముఖ్య పాత్రధారులు.


Click it and Unblock the Notifications











