For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ 'కెవ్వు కేక' స్టోరీ లైన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లరి నరేశ్, షర్మిలా మాండ్రే జంటగా నటించిన 'కెవ్వు కేక' చిత్రాన్ని జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ బుచ్చిరాజు అనే పాత్రను పోషిస్తున్నారు. చిత్రం పూర్తి కామెడీతో నడుస్తుందని, టైమ్ పాస్ చిత్రం అని దర్శకుడు దేవీప్రసాద్ చెప్తున్నారు.

    స్టోరీ లైన్ ప్రకారం...తండ్రి పోగొట్టుకున్న డబ్బును బుచ్చిరాజు అనే యువకుడు ఎలా తిరిగి సంపాదించాడు, దానితో పాటు ప్రేమలో ఎలా విజయం సాధించాడనేది ఈ సినిమా ఇతివృత్తం. ఇందులో ఓ కిడ్నాప్ కథ కూడా ఉంది. ఇందులో నరేష్ పాత్ర పేరు బుచ్చిబాబు. తన తండ్రిని మోసం చేసి కోట్ల ఆస్థిని దోచుకుంటారు కొంతమంది. తన ప్రేమను గెలిపించుకోవాలంటే పోయిన ఆస్థిని మళ్లీ సంపాదించాలి. ఆ దిశగా హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఇందులో విలన్‌గా ప్రఖ్యాత రంగస్థల నటుడు గంగోత్రి సాయి నటించారు. ఆయన పాత్ర సినిమాకు హైలైట్. ఇందులో చెప్పుకోవాల్సిన మరో పాత్ర ఆశిష్ విద్యార్థిది.

    దర్శకుడు మాట్లాడుతూ....ప్రథమార్ధం హైదరాబాద్, ద్వితీయార్ధం బ్యాంకాక్ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఫక్తు టైమ్‌పాస్ సినిమా. 'నా పేరు ధర్మరాజు కాదు.. దిల్ రాజు కాదు.. బుచ్చిరాజు' అనేది హీరో చెప్పే డైలాగ్. అదే అతని కేరక్టరైజేషన్. నరేశ్ అంటే జనం ఏం ఆశిస్తారో ఆ విధంగానే ఈ సినిమా ఉంటుంది. ఒక హాలీవుడ్ సినిమాలో చూసిన ఓ పాయింట్ ఇచ్చిన ప్రేరణతో ఈ సినిమా కథని నేనూ, రచయిత వేగేశ్న సతీశ్ కలిసి తయారు చేశాం. అందరూ కామెడీ అంటే ఇష్టపడతారు. కానీ మిగతా సినిమాలతో పోలిస్తే కామెడీ సినిమాకి తక్కువ విలువ ఇస్తారు అంటున్నారు.

    అల్లరి నరేష్ గురించి చెప్తూ... నరేశ్ ఆల్‌రౌండర్. కేవలం కామెడీయే కాదు, రాజేంద్రప్రసాద్ చేసిన 'ఎర్ర మందారం' సహా ఎలాంటి తరహా పాత్రనైనా చెయ్యగల నటుడు. బుచ్చిరాజుగా విరగదీసేశాడు. తమిళ, కన్నడ భాషల్లో నటించిన షర్మిలకు ఇదే మొదటి చిత్రం. రంగస్థలంపై పేరున్న నటుడు, పలు అవార్డులు తీసుకున్న గంగోత్రి సాయిని విలన్‌గా పరిచయం చేస్తున్నాం. పూర్తి స్థాయి కామెడీ పాత్రలో ఆశిశ్ విద్యార్థి మొదటిసారి కనిపిస్తారు. ఫస్టాఫ్‌లో ఎమ్మెస్ నారాయణ, సెకండాఫ్‌లో కృష్ణభగవాన్ తమ పంచ్ డైలాగులతో అలరిస్తారు. ఆశిశ్ విద్యార్థి భార్యగా కిరణ్ రాథోడ్ ఓ ఆసక్తికర పాత్రలో కనిపిస్తుంది అన్నారు.

    English summary
    Allari Naresh’s forth coming film Kevvu Keka has gearing up for a release on July 19. Devi Prasad is the director of Kevvu Keka touted to be a laugh riot shot in the locales of Bangkok, Hyderabad and Sharmila Mandre will be seen as the heroine in this movie. The film is produced by Boppana Chandra Sekhar under Jahnavi Productions banner while Smt. Neelima will present the movie. Chinni Charan, Bheems composed the music. Kevvu Keka casting MS Narayana, Jeeva, Nisha, Krishna Bhaghavan, Ali, Mumaith Khan,Ashish Vidhyarth in prominent roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X