twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ త్రీడి 'అమ్మ' చిత్రం కథ ఏమిటి?

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ తాజాగా "అమ్మ" అనే త్రీడి చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథ గురించి ఆయన మాట్లాడుతూ...రక్త చరిత్ర సినిమా తర్వార ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్న నాకు...ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ సీరియస్ గా టచ్ చేయని ఎడ్వెంచర్ జానర్ సినిమా చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ఎన్నో ఏళ్ళుగా మెగా బ్లాక్ బస్టర్ హాలీవుడ్ క్లాసిక్ ఎడ్వెంచర్ చిత్రాలుగా పేరుపొందిన మెకానస్ గోల్డ్, రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ చిత్రాల్లా ఓ చిత్రం తియ్యాలన్న నా కోరికని నేను చాలా ఇంటర్వూల్లోనూ, నా బ్లాగ్ ల్లోనూ, ఇంకా చాలా చోట్ల చెప్పటం జరిగింది. ఇలాంటి స్క్రిప్టు కోసం చాలా ఏళ్ళుగా ఆలోచిస్తూనే ఉన్నాను.

    కథ విషయానికి వస్తే..మన దేశంలో ఎన్నో గుప్త నిధులు ఉన్నట్లు ప్రచారం. ఈ గుప్త నిధులు చుట్టూ దానికి సంభందించిన రాజులు, వాళ్ళ ఆత్మలతో పాటు మానవాతీతమైన ఎన్నో అతీంద్రియ శక్తులు వాటికి కాపలాగా ఉంటాయని కూడా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నిధులు,వీటిని కాపాడుతున్న శక్తుల నేపధ్యంలో సాగుతుందీ చిత్రం.

    అత్యాశతో చాలామంది తమ కోరికల్ని తీర్చుకోవటానికి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్ధితినైనా ఎదుర్కోవటానికి సిద్దపడతారు. అలాంటి వాళ్ళ కత ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. అసాధారణ భావోద్వేగాలు, ప్రేక్షకుల్ని ఊహాలోకంలో విహరింపచేసే లొకేషన్స్, ఇంతకుముందన్నెడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ లు...వీటిని త్రీడిలో చిత్రీకరిస్తే అన్న ఆలోచన వచ్చింది.

    ఇలాంటి సినిమాలని త్రీడి టెక్నాలజీ ఎంతో అద్బుతంగా మలిచేందుకు దోహదం చేస్తుంది. టూడీ టెక్నాలజీలో సినిమా చూస్తున్న ప్రేక్షకులు తమ ముందున్న తెర మీద ఎవరికో ఏదో ఆ తెరపై జరుగుతున్నట్లుగా ఫీలవుతారు. కానీ త్రీడి టెక్నాలజీలో పూర్తిగా దీనికి భిన్నంగా ప్రేక్షకుడు కూడా తెర మీద ఆ క్యారెక్టర్లతో పాటు ఉన్నట్లు కనికట్టు కట్టి చూపిస్తుంది.

    నేను ఈ చిత్రంలో చాలా వైవిధ్యమైనరీతిలో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ సీక్వెన్స్ లతో పాటు ట్విస్టులు, మలుపులతో ప్రేక్షకుడికి ఊపిరి తీసుకోవడానికి కూడా వీల్లేని పద్దతిలో సినిమా తీసి, త్రీడి టెక్నాలజీతో ఒక కొత్త అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నా అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X