»   » నగ్న ఫోటోలు పంపాలంటూ హీరోయిన్‌కు వేధింపులు, ఇది ఎవరి పని?

నగ్న ఫోటోలు పంపాలంటూ హీరోయిన్‌కు వేధింపులు, ఇది ఎవరి పని?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: సోషల్ మీడియా ద్వారా వేధింపులు అంటూ ఈ మధ్య పలువురు హీరోయిన్లు పోలీసులను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి పరిస్థితే కన్నడ హీరోయిన్ సంగీత భట్‌కు ఎదురవ్వడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

బికినీ ఫోటోలు పంపాలని, నగ్న ఫోటోలు చూపించాలంటూ కొందరు తనను ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులకు గురి చేస్తున్నారని సంగీత భట్ బెంగుళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అమ్మాయి పేరుతో ప్రొఫైల్

అమ్మాయి పేరుతో ప్రొఫైల్

తనను వేధింపులకు గురి చేస్తున్న వారి ప్రొఫైల్ అమ్మాయి పేరుతో ఉందని చెప్పిన సంగీత భట్..... వారి ప్రొఫైల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు అందించింది.

బ్లాక్ చేసినా వదలకుండా...

బ్లాక్ చేసినా వదలకుండా...

తనకు అసభ్యమైన సందేశాలు పంపుతుండటంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వారి అకౌంట్ బ్లాక్ చేశానని, అయినా వదలకుండా ఫేస్ బుక్ లో అదే ప్రొఫైల్ పేరుతో వల్గర్ మెసేజ్‌లు వస్తున్నాయని ఆమె తెలిపారు.

అబ్బాయా? అమ్మాయా?

అబ్బాయా? అమ్మాయా?

అయితే తనను వేధింపులకు గురి చేస్తోంది అమ్మాయో? లేక అబ్బాయో? అర్థం కావడం లేదని.... అమ్మాయిలు ఇలా చేస్తారని తాను భావించడం లేదని సంగీత భట్ తెలిపారు.

ఫేక్ అకౌంట్ ?

ఫేక్ అకౌంట్ ?

తనను వేధింపులకు గురి చేస్తున్న వారు ఫేక్ అకౌంట్ ద్వారా చేస్తున్నారని అనుమానం ఉందని, పోలీసులు ఈ విషయమై విచారణ జరుపుతున్నారని సంగీత భట్ మీడియాకు వెల్లడించారు.

English summary
Actress Sangeetha Bhat had been receiving messages from a spammer who was pestering her to send nudes. An irate Sangeetha took to her Facebook account to vent out her frustration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu