twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవిత జైలు శిక్షపై...విచ్చలవిడి కామెంట్లు, ఎవరు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గోరు చుట్టుపై రోకలి పోటు అంటే ఇదేనేమో! ఇప్పటికే పలు చిత్రాల వల్ల నష్టాల పాలైన జీవిత రాజశేఖర్ దంపతులకు ఇపుడు మరో కష్టం వచ్చి పడింది. ఓ కేసులో కోర్టు జీవితకు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం జీవిత తన భర్త రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘గడ్డం గ్యాంగ్' అనే చిత్రాన్ని స్వయంగా నిర్మించారు.

    ఈ చిత్రం ద్వారా నష్టాల నుండి ఎంతో కొంత లాభాల బాట పడదామనే ఆశతో జీవిత రాజశేఖర్ దంపతులు ఉన్నారు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాక ముందే కోర్టు ఆమెకు చెక్ బౌన్స్ కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం ఇపుడు హాట్ టాపిక్ అయింది.

    ఇదిలా ఉంటే....జీవితకు రెండేళ్ల జైలు శిక్ష పడిందనే విషయం తెలియగానే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కొందరు విచ్చల విడి కామెంట్లకు తెరతీసారు. అందులో కొన్ని కామెంట్లు అసభ్య కరంగా ఉండటం గమనార్హం. వారంటే పడని ఓ వర్గం మద్దతుదారులు ఈ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.

    స్లైడ్ షోలో జీవిత కేసు వివరాలు...

    చెక్ బౌన్స్ కేసు

    చెక్ బౌన్స్ కేసు

    చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆమెుకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

    నాన్ బెయిలబుల్ వారెంట్

    నాన్ బెయిలబుల్ వారెంట్

    ఇదే కేసులో గతంలో జీవితకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది.

    ఇదీ సంగతి

    ఇదీ సంగతి

    2012లో డిసెంబర్ నెలలో పరంధామిరెడ్డి వద్ద జీవిత రూ. 34 లక్షలు అప్పు తీసుకున్నారు. దానికి గాను ప్రామిసరీ నోట్లు, రెండు చెక్కులు, ఒక అండర్ టేకింగ్ కూడా ఇచ్చారు. మూడు నెలల్లో అప్పు తీరుస్తామని చెప్పారు. ఐతే ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో డబ్బును ఇవ్వాల్సిందిగా జీవితను ఎన్నోసార్లు కోరారు. జీవిత నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పరంధామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు.

    హైకోర్టుకు వెళతారా?

    హైకోర్టుకు వెళతారా?

    ఆయన దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా కోర్టులో విచారణ జరిగింది. దీంతో రూ. 25 లక్షల రూపాయలను కోర్టులో జమచేసి ఆమె బెయిలు పొందారు. నిర్మాత శేఖర్ రెడ్డి తనను మోసం చేసారని జీవిత చెప్పారు.

    English summary
    Stray comments on Tollywood Actress Jeevitha. Jeevitha jailed for two in cheque bounce case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X