2024 Trending searches: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 మూవీస్.. తెలుగు సినిమాలేవంటే?
2024 Trending searches: మరికొన్ని రోజులలో 2024 శుభం కార్డు పడనుంది. 2025 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు.. అందరూ సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ నుండి న్యూ ప్లాన్స్ వేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగానే ఈసారి కూడా ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్ ఈ ఏడాది తమ సర్చ్ ఇంజన్లో ఎక్కువగా శోధించిన వివరాల జాబితాను విడుదల చేసింది. అందులో సినిమాలు, క్రీడలతో సహా పలు అంశాల గురించి నెటిజన్స్ సర్చ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. అయితే.. ఈ ఏడాది 2024లో ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాను కూడా విడుదల చేసింది.
గూగుల్ ఇయర్ ఇన్ సర్చ్ రిపోర్ట్ 2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల జాబితాలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలైన హర్రర్ కామెడీ, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ మూవీస్ నిలిచాయి. ఇందులో ..

స్త్రీ 2: ఈ జాబితాలో మొదటి స్థానంలో స్త్రీ 2 మూవీ టాప్ ప్లేస్ లో నిలిచింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాటి ప్రధానాపాత్రలో నటించిన స్త్రీ 2 సినిమా ఆగస్టు 15న విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం 50 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏకంగా 700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులను క్రియేట్ చేసింది. 2018 లో విడుదలైన 'స్త్రీ' సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాల రికార్డు నెలకొల్పింది.
కల్కి 2898: ఆ తర్వాత స్థానంలో కల్కి 2898 నిలిచింది. ప్రభాస్- నాగ్ ఆశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జూన్ 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ గా మారింది. ఈ చిత్రంలో అమితాబచ్చన్, కమలహాసన్, దిశా పటాని, దీపికా పదుకొనే కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.

12th ఫెయిల్: ఇక మూడో స్థానంలో 12th ఫెయిల్ నిలిచింది. ఈ ఏడాది బాలీవుడ్ నుండి వచ్చిన అద్భుతమైన మూవీ 12th ఫెయిల్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ లో విక్రాంత్ మాసే, మేధా శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. అనంత్ వీ జోషి, ఆయుష్మాన్ పుష్కర్, ప్రియాన్షు చెటర్జీ, గీతా అగర్వాల్ శర్మ, హరీశ్ ఖన్నా కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విధు వినోద్ చోప్రా.. నిర్మాతగానూ వ్యవహరించారు
లాపటా లేడీస్: బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా నాలుగవ స్థానంలో నిలిచింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా చేశారు. అద్భుతమైన మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. అలాగే దేవగన్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ మరియు పనోరమా స్టూడియోస్ నిర్మించాయి.
హను-మాన్: ఐదవ స్థానంలో హను-మాన్ నిలిచింది. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ , శరత్ కుమార్, గెటప్ శ్రీను, సముద్రఖని, వినయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.30 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.350 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
మహారాజా: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి "మహారాజ" సినిమా 6 స్థానంలో నిలిచింది. ఈ సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగులో మంచి విజయం అందుకుంది. విజయ్ కెరీర్ లో ఈ చిత్రం భారీ హిట్ గా నిలించింది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించాడు. అలాగే మమతా మోహన్ దాస్ తదితరులు నటించగా, కాంతారా, విరూపాక్ష, మంగళవారం సంగీత దర్శకుడు అజనీస్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.

మంజుమ్మెల్ బాయ్స్: మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ 7 వ స్థానంలో నిలిచింది. రీసెంట్ గా రిలీజైన మంజుమ్మెల్ బాయ్స్ అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. ఈ సినిమా దాదాపు రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి .. పలు రికార్డులను నెలకొల్పింది. తెలుగులోనూ మంజుమ్మెల్ బాయ్స్ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.
గోట్ : దళపతి విజయ్ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(గోట్) 8 వ స్థానంలో నిలిచింది. లాస్ట్ ఇయర్ లియో మూవీ తో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ చేసి దళపతి విజయ్ లెటెస్ట్ మూవీ గోట్. ది గోట్ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో హీరో దళపతి విజయ్ డ్యూయల్ రోల్ లో కనించారు. ఆయనకు జంటగా హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించగా.. ప్రభుదేవా, ప్రశాంత్, మోహన్, స్నేహా, లైలా తదితరులు ప్రధాన పాత్రలో కనిపించారు.
సాలార్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లో సలార్ ఒకటి. ది మోస్ట్ క్రేజీయెస్ట్ చిత్రంగా సలార్ నిలిచిన ఈ సినిమా 9 వ స్థానంల నిలిచింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీ సలార్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 Ceasefire) మూవీ గతేడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఆవేశం (Aavesham): మలయాళ ఇండస్ట్రీ భారీ విజయం అందుకున్న 'ఆవేశం' (Aavesham) మూవీ 10 స్థానంలో నిలిచింది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలో జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందించారు. కేవలం రూ.30 కోట్లతో నిర్మించిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











