రివెంజ్ డ్రామాగా స్ట్రీట్ లైట్...పొద్దున్న అలా, కానీ రాత్రి మరోలా!

తెలుగులో ఇప్పుడు చిన్న సినిమాల హవా నడుస్తోంది. అయితే నవంబర్ 19న చాలా సినిమాలు విడుదల అవుతూ ఉండగా అందులో స్ట్రీట్ లైట్ మూవీ ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 150 థియేటర్స్ లలో "స్ట్రీట్ లైట్" మూవీ విడుదల కాబోతోంది. ఈ స్ట్రీట్ లైట్ మూవీ మాక్స్ బ్యానర్ పై తెరకెక్కింది. తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించారు. "స్ట్రీట్ లైట్ మంచి ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు లో నవంబర్ 19న 150 థియేటర్స్ లో ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ సినిమా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఈ సినిమా చాలా బాగా వచ్చిందనీ అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ మాకు సపోర్ట్ చేయడంతో మాకు 150 థియేటర్స్ దొరికాయన్న ఆయన తమ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అని అన్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద విభిన్న వ్యక్తుల వింత పోకడలను సునిశితమైన రీతిలో వినోదాత్మకంగా చూపిస్తూ, పగలు మంచివాళ్ళుగా చెలామణి అవుతూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్ తో ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో అనే విషయాన్ని చూపారు.

Street light movie releasing on November 19th in Telugu

ఇక వీరిలో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే 'రివెంజ్ డ్రామా' కథాంశంతో స్ట్రీట్ లైట్ చిత్రం రూపొందించడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. అద్భుతమైన మేకింగ్ వాల్యూస్ తో వైవిధ్యభరితమైన సినిమాను రూపొందించి నందుకు సెన్సార్ సభ్యులు అభినందించారట. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ "స్ట్రీట్ లైట్" సినిమాని నవంబర్ 19న 150 థియేటర్లలలో ఎంజాయ్ చేయాలని నిర్మాతలు కోరారు. ఈ సినిమాలోతాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్, చిత్రం శ్రీను, ధన్ రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర, బాలాజీ నాగలింగం తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X