వైయస్ జగన్ కథ కాదంటూ దర్శక,నిర్మాత
హైదరాబాద్ : ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో అవసరమైన మార్పులు ఏమిటో 'స్టూడెంట్ స్టార్' చిత్రంలో చర్చించామే కానీ, నైజాం డిస్ట్రిబ్యూటర్లు అనుకుంటున్నట్లుగా రాజకీయ నాయకుడైన జగన్ కథ మాత్రం కాదని చిత్ర దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు. రాజ్ కె.ఎస్.గోపి కథానాయకుడుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'స్టూడెంట్ స్టార్' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నైజాం పంపిణీదారులు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సందేహం వెలిబుచ్చారని, ప్రేక్షకులు అనుకుంటున్నట్టుగా వివాదాస్పద చిత్రం కాదని వారు తెలియజేశారు.

ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత పి.సి.రెడ్డి, ఎం.శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ హర్ష మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై అన్ని కేంద్రాలలో అద్భుత విజయాన్ని సాధిస్తోందని, విద్యార్థుల శక్తి ఎలాంటిదో ఈ చిత్రంలో చూపామని, అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు. భారీ తారాగణం లేకపోయినా వసూళ్ల పరంగా సంతృప్తిగా సాగుతోందని, యువ నేత స్టూడెంట్ పవర్‌తో ముఖ్యమంత్రిగా ఎదిగితే ఎలా వుంటుందో అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించామని, పాటలు, మాటలు హైలెట్‌గా నిలుస్తున్నాయని దర్శకుడు రాజ్ కె.ఎస్.గోపి తెలిపారు. నైజాం ప్రాంతంలో ఈ నెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.
దర్శకుడు, హీరో గోపిరెడ్డి మాట్లాడుతూ-''ఇదొక భిన్నమైన సినిమా. కళాశాల నేపథ్యంలో సినిమా సాగుతుంది. నేటి విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంది? భావిభారతపౌరులైన వాళ్లు ఎలాంటి మార్గంలో పయనించాలి? అనేప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. దాదాపుగా అందరూ కొత్తవాళ్లే ఇందులో నటించారు'' అని చెప్పారు. చాలామందిని హీరోగా అనుకున్నామని, కానీ గోపిరెడ్డే ఈ పాత్ర చేస్తే బాగుంటుందని అనిపించిందని సమర్పకుడు పీసీరెడ్డి తెలిపారు. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్దేశించే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు.
అలాగే స్టూడెంట్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ..కొత్త ఒరవడిని సృష్టించే చిత్రమిది.రొటీన్‌కి భిన్నంగా విద్యార్ధులను పాజిటివ్ కోణంలో చూపించాం. ఈ తరం విద్యార్థి ఎలా ఉండాలి? ఎలా ఉంటే భవిష్యత్ ఉంటుంది అనేది చెబుతున్నాం. ప్రేమకథ సాగుతూనే కుటుంబ సమేతంగా చూసేలా తీర్చిదిద్దాం అన్నారు.ఈ చిత్రానికి కెమెరా: కుటుం కిషోర్, సంగీతం: రాము, నిర్మాణం: సన్‌గ్రేస్ మూవీస్. జరా రచ్చాసి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి డి.రాము సంగీతాన్ని అందించారు. అనిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











