twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిజినెస్ మ్యాన్'పోస్టర్ పై పోలీస్ కంప్లైంట్

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ చిత్రం రోజూ ఏదో ఒక విధంగా వార్తలకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం పోస్టర్ పై ఓయూ జాయింట్ యాక్షన్ కమిటీ ఓ కంప్లైంట్ ని నిన్న ఆదివారం నమోదు చేసింది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'A'సర్టిఫికేట్ ఇచ్చింది కానీ వారు దాన్ని పోస్టర్స్ వేయటం లేదని ఆరోపించింది. ఈ విషయమై కంప్లైంట్ చేసిన వారిలో ఒకరైన కర్నాటి రాజు మాట్లాడుతూ...జూలై 27,2007లో డిజిపీ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏ నిర్మాత అయినా సెన్సార్ సర్టిఫికేట్ ని పోస్టర్స్ పై చూపకపోతే వారిని నాన్ బెయిల్ బుల్ కేసులో బుక్ చేయాలనే ఆర్డర్ ఉందని గుర్తు చేసారు.

    అయితే కంప్లైంట్ పై ఓయూ పోలీసులు..లీగల్ ఒపీనియన్ తీసుకుని ఈ కేసుని రిజిస్టర్ చేసి విచారిస్తామన్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేయగా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. మహేష్ బాబు,కాజల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డులను బ్రేక్ చేసే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

    English summary
    Activists of OU Joint Action Committee on Sunday lodged a complaint with the OU police against the makers of Mahesh Babu’s film Businessman. They alleged that though the Censor Board had given the film ‘A’ certification, it is not reflected in the posters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X