twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రాన్ని చూడమని ప్రమాణం,ఇతరులూ చూడొద్దని విజ్ఞప్తి

    By Srikanya
    |

    వైజాగ్ : ఆర్యమన్, కావ్యాసింగ్ జంటగా సూర్యలోక్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రం 'సారీ టీచర్' . ఈ చిత్రం చట్టపరంగా వచ్చిన అన్ని అవరోధాలను తొలగించుకుని విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం చూడమంటూ,నిషేధించాలంటూ ఇంకా డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే...తెలుగులో నిర్మించిన 'సారీ టీచర్‌' చిత్రం నిషేధించాలని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. అనకాపల్లి ఎస్‌వీఎస్‌ వృత్తి విద్యా కళాశాల విద్యార్థులు స్థానిక శారదానగర్‌ శ్రీనివాస కల్యాణ మండపంలో ఆదివారం సమావేశమయ్యారు. తల్లిదండ్రుల తరువాత గురువుకు ముఖ్య స్థానం ఇచ్చిన మన సమాజంలో ఇలాంటి పేర్లు పెట్టడాన్ని ఎవరూ అంగీకరించకూడదని విద్యార్థులు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.

    ఈ పేరు ఉపాధ్యాయులను అవమానపర్చేలా, కించపరిచేలా ఉందని వారు అభిప్రాయపడ్డారు. గురువులను కించపరిస్తే మనల్ని మనం కించపరిచినట్లేనన్నారు. మహిళా ఉపాధ్యాయులను అగౌరవపరిచేలా ఈ చిత్రం పేరు ఉందని వారు ఖండించారు. ఇలాంటి పేర్లను సెన్సార్‌, ప్రభుత్వం అంగీరించకుండా ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ చిత్రాన్ని చూడమని వారు ప్రమాణం చేశారు. ఉపాధ్యాయులతోనూ వారు ప్రమాణం చేయించారు. ఇతరులూ చూడొద్దని విజ్ఞప్తి చేశారు.

    చలన చిత్రాల నిర్మాతలు కేవలం వ్యాపార, లాభార్జన కోసమే కాకుండా నైతిక విలువలు, బాధ్యతలు, సమాజ శ్రేయస్సు విస్మరించకూడదని వారు సూచించారు. భవిష్యత్తు సమాజానికి చలన చిత్రాలు దిశానిర్థేశం చేసేలా రూపొందించాలని వారు కోరారు. వారంతా పోస్టుకార్డులు కొనుగోలు చేసి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు అయిదు వందల లేఖలు రాశారు. ప్రభుత్వాధికారులను కలసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఇక 'సారీ టీచర్' కి హైదరాబాద్ సిటీలో ఎక్కడా ధియోటర్స్ దొరకలేదు. కేవలం హైదరాబాద్ అవుట్ స్కట్ లోని కొంపల్లె సిని ప్లానెట్ లో మాత్రమే ఈ చిత్రం విడుదలైంది. దీనికి కారణం అదే రోజు రిలీజన విక్రమ్ శివ తాండవం,శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రాలు అధ్యధిక ధియోటర్స్ ఆక్రమించటమే.

    'సారీ టీచర్' చిత్రానికి శ్రీసత్య దర్శకత్వం వహించారు. దర్శకుడు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ-''టీచర్‌ని ఓ స్టూడెంట్ ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ సినిమా రూపొందించాను. ఇందులో స్టూడెంట్ చూడకూడనివి చూస్తూ, చేయకూడనివి చేస్తూ, అనకూడనివి అంటూ చివరకు 'సారీ టీచర్' అంటుంటాడు. టీచర్‌ని ప్రేమలో పడేయడానికి స్టూడెంట్ చేసిన ప్రయత్నాలేంటి? అతని ప్రయత్నం సఫలం అయ్యిందా? అనే ప్రశ్నలకు సమధానమే మిగిలిన కథ''అని తెలిపారు.

    ఈ సినిమాలో టీచర్‌గా కావ్యాసింగ్, ఆర్యమన్ స్టూడెంట్‌గా నటించారు. వీరిద్దరికీ ఇదే తొలి సినిమా. తన పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు తనకు బాగా నచ్చిందని, ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని తనూ చూడాలనే కోరికతో ఉన్నానని కావ్యాసింగ్ చెప్పారు. అయితే ఆమె కోరిక తీరే అవకాసం మాత్రం రాలేదు. ఆసక్తికరమైన సంఘటనలతో సినిమా రూపుదిద్దుకుందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు చెప్పారు. శ్వేత, మేల్కొటే, కోట శంకరరావు, జాకీ, అభినయకృష్ణ, జెమిని ఫణి, పద్మాజయంతి, రేవంత్‌రెడ్డి, హర్ష, మాస్టర్ మనోజ్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: జయసూర్య, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఫొటోగ్రఫీ: సాయి, ఎడిటర్: అర్చనా ఆనంద్, నిర్మాత: ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీసత్య.

    English summary
    Most controversial flick Sorry Teacher released and failed. While a section of mass public who are excited by the skin show of kavya singh on the posters and news papers were ready to spend two hours and a ticket, many did not get a chance to listen the sexy lectures of this teacher.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X