twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృంగార తార సిల్క్ స్మితపై అధ్యయనం

    By Pratap
    |

    హైదరాబాద్: దక్షిణాది సినీ రంగాన్ని తన అందాలతో ఓ ఊపు ఊపిన శృంగార తార సిల్క్ స్మిత జీవితంపై టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ అధ్యయనం చేయనుంది. దక్షిణాది సినిమాల్లో శృంగార పాత్రలకు సరికొత్త భాష్యం చెప్పిన మత్తు కళ్ళ సుందరి సిల్క్ స్మిత జీవితం ఇప్పుడు అధ్యయనానికి వస్తువుగా మారింది.

    ఇటీవల బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటించిన 'డర్టీ పిక్చర్'తో స్మిత జీవిత విశేషాలపై అందరిలోనూ ఆసక్తి పెరిగిన విషయం తెలిసిందే. డర్టీ పిక్చర్‌లో సిల్క్ పాత్రను సామాజిక, మానసిక కోణంలో అధ్యయనం చేయాలని టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నిశ్చయించింది.

    టాటా సంస్థ సామాజికవేత్తలు ఎంతో పరిశీలించిన మీదట 'డర్టీ పిక్చర్' లో విద్య పోషించిన పాత్ర అయితే అధ్యయనానికి సరిగ్గా సరిపోతుందని భావించినట్లు తెలుస్తోంది. కాగా మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించిన డర్టీపిక్చర్‌లో విద్యాబాలన్, నజీరుద్ధీన్ షా, తుషార్ కపూర్, హష్మీ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మించిన సంగతి తెలిసిందే.

    డర్టీ పిక్చర్స్ సినిమా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విద్యాబాలన్ నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. సినిమాపై వివాదం కూడా చెలరేగింది.

    English summary
    Tata institute of social sciences has decided to take up a study on South Indian star Silk Smitha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X