»   »  శ్రియకి మూడ్ వస్తే అంతే...

శ్రియకి మూడ్ వస్తే అంతే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shriya
ఎప్పుడూ రిజర్వ్ గా ఉండే శ్రియ మొన్న (28న) ఓ పంక్షన్ కి అటెండయి రెచ్చిపోయి డాన్స్ చేసేసి అందరినీ షాక్ కి గురిచేసింది. ముంబయి దగ్గరలోని ఓర్లి లో ఉన్న హోటల్ ఫోర్ సీజన్ లో జెంటిల్ మెన్స్ క్వార్టర్లీ పత్రిక లాంచింగ్ సందర్భంగా ఈ పంక్షన్ ఎరేంజ్ చేసారు. బాలీవుడ్ నుండి లారాదత్తా,మలైకా అరోరా, డినో మోరియా,కొంకనా సేన్,రణబీర్ షోరే, జియా ఖాన్, తారా శర్మ,రవీనా టండన్ ,సోఫియా చౌధరి, అర్జున్ రాంబాల్,చుంకీపాండే,యువరాజ్,రాహుల్ ఖన్నావంటి ఎందరో సెలబ్రటీలు అటెండయ్యారు.

అందరిలోకి శ్రియ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఏం మూడ్ వచ్చిందో ఏమో మైమరిచిపోయి మరీ డాన్స్ చేసేసింది. ఆమె అంత ఎక్సైస్ మెంట్ కి గురవవటం ఇంతగాకా ఎవరూ చూసి ఎరుగరట. కారణమేంటా అనేది తాజా చర్చగా మారింది. అసలు ఆమె ఫేస్ ఫీలింగ్సే చాలా మంది అక్కడ చేరిన మగవాళ్ళ మతులు పోగెట్టాయట. కాకపోతే ఆమె దగ్గరవాళ్ళు మాత్రం తమకిదేమీ కొత్త కాదని ఆమెకి మూడ్ వస్తే పట్టుకోవటం కష్టమేనని ఇలాగే ప్రవర్తిస్తుందని...ప్రక్కన ఎవరున్నా పట్టించుకోదని అంటున్నారు. ఇంతకీ ఆమెకి హఠాత్తుగా మూడ్ ఎందుకు వచ్చిందబ్బా...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X