»   » ఆమె సెక్సీనెస్ రహస్యం ఏమిటో? (ఫోటో ఫీచర్)

ఆమె సెక్సీనెస్ రహస్యం ఏమిటో? (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్లో యమ హాటుగా, పర్ ఫెక్ట్ ఫిగర్ తో ఉండే సుందరాగుల్లో నర్గీస్ ఫక్రి ఒకరు. అమ్మడు చూడటానికి 25 ప్లస్ లా కనిపించినా...నిజానికి ఆమె వయసు 35 ప్లస్. అమెరికన్ మోడల్ అయిన నర్గీస్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ భామ తన సెక్సీ అందచందాలతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. ‘రాక్ స్టార్' తర్వాత తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన 'మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ చిత్రంలో నటన పరంగా కానీ, గ్లామర్ పరంగా కానీ నిరూపించుకునే అవకాశం రాలేదామెకు.

అనంతరం ‘పతా పోస్టర్ నిక్లా హీరో' అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. కానీ తర్వాత విడుదలైన 'మే తేరా హీరో' చిత్రం హిట్ కావడం అమ్మడుకి కలిసొచ్చింది. తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘కిక్' సినిమాలో నర్గీస్ చేసిన ఐటం సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే హీరోయిన్‌గా ఎదగాలనే నర్గీస్ ఫక్రి ఆశ మాత్రం తీరడం లేదనే చెప్పాలి. మెయిన్ హీరోయిన్ అవకాశాలు పెద్దగా రాక పోవడంతో వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుని ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అజార్, హౌస్ ఫుల్ 3, బంజో, డిష్యుం అనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

స్లైడ్ షోలో నర్గీస్ ఫక్రికి సంబంధించిన ఆసక్తికర విషయాలు, మాట్ ఫోటోస్...

నర్గీస్ ఫక్రి బయోగ్రఫీ

నర్గీస్ ఫక్రి బయోగ్రఫీ


నర్గీస్ ఫక్రి ఫాదర్ పాకిస్థాన్‌ సంతతికి చెందిన వాడు కాగా, తల్లి చెకోస్లోవియాకు చెందినది. న్యూయార్కులో జన్మించింది.

ఫక్రి

ఫక్రి


తన సర్ నేమ్ ఫక్రి అనేది మోడలింగ్ రంగంలో ఉన్నపుడు అసలు ఉపయోగించలేదట. అలాంటి ఉద్దేశ్యం కూడా లేదట.

సాహసాలు

సాహసాలు


గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై నడవటం, మచుపిచు లాంటి పర్వతాలు ఎక్కడం లాంటి సాహసాలు అంటే ఆమెకు ఇష్టం.

బాలీవుడ్

బాలీవుడ్


బాలీవుడ్‍‌కి రాక ముందు నాకు ఇక్కడి పరిశ్రమ గురించి పెద్దగా తెలియదు. పెద్దగా అవగాహన లేకుండానే వచ్చాను. ఇక్కడి వచ్చాక పరిశ్రమలోని పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాను అని నర్గీస్ చెప్పుకొచ్చింది.

కప్పలు, చీమలు తింటుంది

కప్పలు, చీమలు తింటుంది


నర్గీస్ ఫక్రీ అన్నిరకాల ఫుడ్ తింటుంది. మొసలి, కప్పలు, చాక్లెట్లో కలిపిన చీమలు కూడా తింటుందట.

గ్లామర్ బ్యూటీ

గ్లామర్ బ్యూటీ


అందాల ఆరబోత విషయంలో నర్గీస్ ఎలాంటి అభ్యంతరాలు తెలుపదు. ఎందుకంటే ఆమె ఇంటర్నేషనల్ మోడలింగ్ రంగం నుండి వచ్చింది కాబట్టి.

మోడలింగ్

మోడలింగ్


2005లో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని, అప్పటి నుండి వివిధ ప్రాంతాలు తిరగటం, ఇంటికి దూరంగా ఉండటం అలవాటయిందని నర్గీస్ చెప్పుకొచ్చింది.

ఆల్రెడీ..

ఆల్రెడీ..


తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతూ...ఓ నైట్ క్లబ్ లో కలిసాను. ఆరు నెలల తర్వాత ప్రేమలో పడ్డాను. కొంతకాలం కలిసి సహజీవనం చేసాం, జీవితంలో చాలా చేయాల్సి ఉంది కాబట్టి అతని నుండి విడిపోయాను అంటోంది.

పెళ్లి గిల్లి జాన్తానై

పెళ్లి గిల్లి జాన్తానై


నేను ఇండిపెండెంటుగా ఉండటానికి ఇష్ట పడతాను. నా డబ్బు నేనే సంపాదించుకుంటాను. ఎక్కడికైనా ఒంటరిగా ట్రావెల్ చేస్తాను. అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని తెలిపింది.

English summary
Nargis Fakhri, entered Bollywood in 2011, through the movie, Rockstar and starred alongside Ranbir Kapoor. The movie was directed by Imtiaz Ali and fared pretty well at the box office. Rockstar, is about a rock musician who finds it difficult to put across his point of view to the society, but manages to do it through music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu