»   » అర్మానీ పార్టీలో ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్ (ఫోటోస్)

అర్మానీ పార్టీలో ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్....ఇటలీలోని మిలన్ నగరంలో జరిగిన అర్మానీ పార్టీలో స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. 40 ఏళ్ల వయసులోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ సూపర్ హాట్ లుక్ లో ఐశ్వర్యరాయ్ కనిపించడంపై హాట్ టాపిక్ అయింది.

అర్మానీ డాజ్లింగ్ బ్లూ బ్లెజర్ వేసుకుని దర్శనమిచ్చిన ఐశ్వర్యరాయ్ దానికి పర్ ఫెక్టుగా సూటయ్యేలా బ్లాక్ ట్రౌజర్ ధరించింది. 2015లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ ఇది. ఐశ్వర్యరాయ్ కోసం దీన్ని డిజైనర్లు ప్రత్యేకంగా డిజైన్ చేసారు. ఆమె హెయిర్ స్టైల్ కూడా అదిరి పోవడంతో ఐశ్వర్యరాయ్ లుక్ మరింత అందాన్ని సంతరించుకుంది.

Stunning Pics Of Aishwarya Rai At The Armani Party In Milan

ఆమె వేసుకున్న డ్రెస్సుకు మ్యాచ్ అయ్యే వజ్రాలు పొదిగిన చెవి కమ్మలు, బ్లాక్ పంప్స్ ఆమె లుక్ అదిరిపోయేలా చేసాయి. ప్రతి సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అర్మానీ కలెక్షన్ల ప్రచార కర్తగా ఐశ్వర్యరాయ్ రెడ్ కార్పెట్ మీద దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.

Stunning Pics Of Aishwarya Rai At The Armani Party In Milan

అర్మానీ డిజైనర్ లేబుల్ స్థాపించిన 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మిలన్ సెలబ్రేషన్స్ జరిగాయి. వేడుకలకుకోసం ఐశ్వర్యరాయ్ కి ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. గత కొన్నేళ్లుగా ఆమె అర్మానీ సంస్థతో కలిసి పని చేస్తోంది.

English summary
When Aishwarya Rai, the stunning actress from Bollywood turned up at the Armani party in Milan, all eyes were on her. She just totally rocked the look that she carried.
Please Wait while comments are loading...