For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రభాస్.. ఇక ఒక్కటి మాత్రమే!

    |

    Recommended Video

    Prabhas Attitude Impressed Stunt Choreographer || Shraddha Kapoor || Sujeeth || Saaho || Filmibeat

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కు నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోలకు ధీటైన మార్కెట్ ఉన్న నటుడు ప్రభాస్ ఎదిగాడు. అందుకే ప్రభాస్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మొదటి నుంచి సాహో యాక్షన్ సీన్స్‌పై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ సాహో గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

     కనీవినీ ఎరుగని విధంగా

    కనీవినీ ఎరుగని విధంగా

    యువ దర్శకుడు సుజిత్ సాహో చిత్రంలో యాక్షన్ సన్నివేశాలని అంతర్జాతీయ స్థాయి విలువలతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ కోసం భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేస్తున్నట్లు ఇదివరకే వార్తలు వస్తాయి. గత ఏడాది దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద చిత్రకరించిన సన్నివేశాల కోసం 90 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇంటర్వెల్ సన్నివేశం కోసం 30 కోట్లకు ఖర్చుచేసినట్లు తెలిసింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. సాహో చిత్రంలో పోరాట సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అని.

    మేకింగ్ వీడియో

    షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో చిత్ర యూనిట్ ఇప్పటికే రెండు మేకింగ్ వీడియోల్ని చిత్ర యూనిట్ విడుదుల చేసింది. గత ఏడాది ప్రభాస్ బర్త్ డే సంధర్భంగా ఓ వీడియోకి రిలీజ్ చేశారు. ఇటీవల శ్రద్దా కపూర్ బర్త్ డే సంధర్భంగా మరో వీడియోని వదిలారు. ఉన్నతస్థాయి స్థాయి ప్రమాణాలతో, హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో చిత్రికరణ అద్భుతంగా ఉంది. ప్రభాస్ మరోమారు సూపర్ హీరోలా సాహోలో కనిపించబోతున్నాడు.

     ఆశ్చర్యపోయిన స్టంట్ కొరియోగ్రాఫర్

    ఆశ్చర్యపోయిన స్టంట్ కొరియోగ్రాఫర్

    తాజాగా సాహో ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించాడు. సాహో చిత్రం కోసం ప్రభాస్ చూపిస్తున్న కమిట్మెంట్ అద్భుతం అని అన్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ పెర్ఫామ్ చేస్తున్న విధానం తమని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది కెన్నీ తెలిపారు. ఇంతటి భారీ చిత్రంలో నటించేతప్పుడు కాస్త అలసట ఉంటుంది. కానీ ప్రభాస్ డే మొత్తం సెట్స్‌లో ఉత్సాహభరితంగా ఉంటున్నట్లు కెన్నీ తెలిపారు.

    ఎన్నో ఎత్తు పల్లాలు.. భావోద్వేగానికి గురైన సమంత: ‘ఓ బేబీ' గురించి..

     మతి పోగొట్టేలా

    మతి పోగొట్టేలా

    ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రభాస్ నటించే ఛేజింగ్ సన్నివేశాలు మతి పోగొట్టేలా ఉంటాయి. ఆడియన్స్ అద్భుతమైన అనుభూతికి లోనవుతారు. ఇక ఈ చిత్రంలో ఒకే ఒక్క పెద్ద యాక్షన్ సీన్ షూటింగ్ మిగిలి ఉందని, అది పూర్తయితే షూటింగ్ దాదాపుగా ముగిసినట్లే అని తెలిపారు.బాలీవుడ్ నటులు మందిరాబేడి, ఎవిలిన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Stunt choreographer Kenny Bates was awestruck by Prabhas’ commitment
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X