నటితో అక్రమ సంబంధం... ఫైట్ మాస్టర్ అరెస్టు

తన భర్త నుంచి డబ్బు గుంజేందుకే సహాయ నటి లక్ష్మి పోలీసులకు అక్రమ ఫిర్యాదు చేసిందని వెంకటేష్ భార్య రమాదేవి ఆరోపించారు. గతంలో పలుమార్లు తన భర్తను ఆమె మొబైల్ ఫోన్‌లో బెదిరించేదని గుర్తు చేశారు. తాను కోరిన మొత్తం ఇవ్వకపోతే పోలీసు కేసు పెడతానని లక్ష్మి గతంలో బెదిరించినప్పుడే తాము పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఎదుయ్యేది కాదని విలేకరుల వద్ద ఆమె ఆవేదన వెలిబుచ్చారు.
రెండేళ్ల క్రితం ఆమెకు కౌరవ వెంకటేష్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి తరచూ ఆమె ఇంటి కి రాకపోకలు సాగించే వెంకటేష్, లక్ష్మిని వివాహం చేసుకుంటానని ఆమె తల్లిని నమ్మించాడు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి షూటింగ్‌లకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్‌కు గతంలోనే మరొకరితో వివాహమైనట్లు లక్ష్మి గుర్తించింది. అయినా లక్ష్మిని రెండవ పెళ్లి చేసుకుంటానని భరోసా ఇచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని మూడు నెలలుగా ఒత్తిడి చేస్తున్నా వెంకటేష్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పెళ్లి చేసుకోనని అతను తేల్చి చెప్పాడు. దీంతో పోలీసులకు లక్ష్మి శుక్రవారం ఫిర్యాదు చేసింది.
ఫైట్ మాస్టర్ కౌరవ వెంకటేష్‌ను నందిని లే ఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఎదుట శుక్రవారం హాజరు పరిచి, జనవరి 2వరకు పోలీస్ కస్టడికి తీసుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకుని మోసం చేశాడని నటి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందిని లే ఔట్‌కు చెందిన లక్షి, కొన్ని సినిమాలలో డూప్‌గాను, సహాయ నటిగాను పనిచేసింది.


Click it and Unblock the Notifications











