సైరాకు మరణశిక్ష, కథకు అదే ఆధారం.. ఆ ప్రశ్నకు పగలబడి నవ్వేసిన హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్!

Recommended Video

Sye Raa Narasimha Reddy Teaser Launch Event

సైరా నరసింహారెడ్డి సంచలనాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్ర టీజర్ విడుదలయింది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గెటప్ లో మెగాస్టార్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. సైరా చిత్రంలో పోరాటాలు, యుద్ధ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మరణ శిక్ష

మరణ శిక్ష

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితాన్ని యధాతధంగా తెస్తున్నారా లేక మార్పులు చేసారా అనే ప్రశ్నకు దర్శకుడు సురేందర్ రెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డికి మరణ శిక్ష విధించింది. ఆ గెజిట్ లో పొందుపరిచినా చాలా అంశాలు ప్రజలకు తెలియదు. మరణశిక్ష గెజిట్, నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా ఈ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని సురేందర్ రెడ్డి తెలిపారు.

 అధ్యయనం

అధ్యయనం

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర గురించి సురేందర్ రెడ్డి, సైరా చిత్ర యూనిట్ అధ్యయనం చేశారు. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు జీవిత చరిత్రని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారు.

హాలీవుడ్ కొరియోగ్రాఫర్

హాలీవుడ్ కొరియోగ్రాఫర్

సైరా చిత్రానికి పోరాట సన్నివేశాలని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే సైరా పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. జార్జ్ పావెల్, లీ వంటి ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ సైరా చిత్రం కోసం పనిచేస్తుండడం విశేషం.

 తెల్లవారిని

తెల్లవారిని

హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ లీ కూడా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మీడియా నుంచి అతడికి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. లీ అమెరికాకు చెందిన వ్యక్తి. బ్రిటిష్ వారు, అమెరికన్స్ అంతా తెల్లవారు. మా సైరా నరసింహా రెడ్డి మీ తెల్లవారిని చంపుతుంటే ఎలా అనిపిస్తుంది అని మీడియా నుంచి లీ కి ప్రశ్న ఎదురైంది.

అదిరిపోయే సమాధానం

అదిరిపోయే సమాధానం

ఈ ప్రశ్నకు లీ పగలబడి నవ్వుకున్నాడు. చాలా ఆసక్తికరమైన ప్రశ్న అంటూ అదిరిపోయే సమాధానం. తెల్లవారు, నల్ల వారు అనే తేడా లేదు. దేశభక్తి ఎక్కడైనా దేశభక్తే. ఈ చిత్రం స్వాతంత్ర సమరం నేపథ్యంలో తెరకెక్కుతోంది. కాబట్టి తెల్లవారిని చంపడానికి సైరాకు నేను కూడా సాయం చేస్తున్నా అంటూ లీ సమాధానం ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X