డైరెక్టర్‌గా పీటర్ హెయిన్స్.. సెన్సేషనల్ నిర్మాత.. క్రేజీ ప్రాజెక్ట్‌తో!

దేశవ్యాప్తంగా గొప్ప యాక్షన్ డైరెక్టర్‌గా గొప్ప పేరు సంపాదంచుకొన్న పీటర్ హెయిన్స్ దర్శకత్వం చేపట్టబోతున్నారు. తమిళ దర్శకుడు గౌత‌మ్ మీన‌న్ రూపొందించిన చెలి మూవీతో ఫైట్ మాస్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పీటర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో మురారితో టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ త‌ర్వాత దక్షిణాదిలో అప‌రిచితుడు, శివాజీ, గ‌జిని, మ‌గ‌ధీర‌, రోబో, విల‌న్‌, విక్ర‌మ సింహ‌, బాహుబ‌లి, మ‌న్యం పులి...లాంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫి చేశారు. తాజాగా డైరెక్టర్‌గా పీట‌ర్ హెయిన్స్ స్టార్ట్... కెమెరా... యాక్ష‌న్‌ అని చెప్పబోతున్నాడు.

 ఎప్పటి నుంచో గుసగుసలు

ఎప్పటి నుంచో గుసగుసలు

పీట‌ర్ హెయిన్స్ మెగాఫోన్ ప‌ట్టుకుంటార‌ని ఎప్ప‌టి నుంచో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. డైరెక్ట‌ర్‌గా త‌న డ్రీమ్ డెబ్యూ గురించి చాన్నాళ్లుగా ఆయ‌న కూడా ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. అది ఇప్ప‌టికి కార్య‌రూపం దాల్చింది. పీట‌ర్ హెయిన్స్ క‌ల‌ను సాకారం చేయ‌డానికి నిర్మాత న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) ముందుకొచ్చారు.

క్రేజీ నిర్మాత నల్లమలుపు బుజ్జి

క్రేజీ నిర్మాత నల్లమలుపు బుజ్జి

ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై `ల‌క్ష్మీ`, `ల‌క్ష్యం`, `రేసు గుర్రం`, `ముకుంద‌`... ఇలా ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి. తాజాగా త‌మ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు.

 ఎక్స్‌టార్డినరీ కథతో

ఎక్స్‌టార్డినరీ కథతో

పీటర్ హెయిన్స్ చిత్రం గురించి న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) స్పందించారు. ఆయన మాట్లాడుతూ `` పీట‌ర్ హెయిన్స్ మాస్టర్ చెప్పిన క‌థ విన‌గానే న‌చ్చింది. క‌థ టేకాఫ్ అయ్యే విధానం నుంచి ప్ర‌తిదీ ఎక్స్ ట్రార్డిన‌రీగా అనిపించింది. అందుకే వెంట‌నే ఓకే చెప్పేశాను. హీరో, హీరోయిన్ తో పాటు ఇత‌ర ఆర్టిస్టుల‌ను ఎంపిక చేయాలి. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాను. చిత్రాన్ని ద‌స‌రాకు పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభిస్తాం. మా బ్యాన‌ర్‌లో మ‌రో మంచి సినిమా వ‌స్తుంద‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను`` అని అన్నారు.

వారి దారిలోనే పీటర్ హెయిన్స్

వారి దారిలోనే పీటర్ హెయిన్స్

సౌత్ ఇండియాతోపాటు, బాలీవుడ్ సినిమాల‌కు యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేసి ఓ బ్రాండ్‌గా ఎదిగారు. స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ కేట‌గిరీని తొలిసారి జాతీయ అవార్డుల్లో పొందుప‌రిచిన‌ప్పుడు, ఆ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా ఆయ‌న పేరు న‌మోదైంది. తాజాగా దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టడంపై సినీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు ప్రభుదేవా, లారెన్స్ లాంటి డ్యాన్స్ డైరెక్టర్లు డైరెక్టర్లుగా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ గతంలో యాక్షన్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్‌గా మారారు. ఇప్పడు అదే కోవలో పీటర్ హెయిన్స్ కూడా చేరడంతో ఆయన ఎలాంటి కథను తెరకెక్కిస్తారనే విషయంపై ఆసక్తిగా చర్చ జరుగుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X