పవన్ కళ్యాణ్ తో ఫైట్ చేసి మా సత్తా చూపిస్తాం...!?
ఈ ఏడాది ఉత్తమ స్టంట్ మాస్టర్స్ గా నంది పురస్కారాన్ని గెలుచుకున్న రామ్ లక్ష్మణ్, తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలందరితోనూ వర్క్ చేసినా, ఒక్క పవన్ కళ్యాణ్ తో మాత్రం ఇప్పటిదాకా తమకు అవకాశం రాలేదని వాపోతున్నారు. పవన్ కళ్యాణ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో అద్బుతమైన ప్రతిభ చూపిస్తారనీ, యాక్షన్ సీక్వెస్ లో ఆయన స్టయిలే వేరనీ, ఆయనతో ఛాన్సొస్తే స్టంట్ మాస్టర్స్ గా తమ సత్తా మరింతగా చాటుకుంటామని అంటున్నారు రామ్ లక్ష్మణ్.
గతంతో పోల్చితే ప్రస్తుతం పవన్ చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు గనుక, ఏదో ఒకరోజు తమకూ పవన్ తో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తుందన్న నమ్మకం కలిగిందని రామ్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. పవన్ చేసే యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఆయన సినిమాల్ని రెగ్యులర్ గా చూస్తుంటామనీ, యాక్షన్ పండించడానికి వివిధ యుద్ద విద్యల్లో ప్రాక్టీస్ కోసం పడే తపన అద్భుతమని కొనియాడుతున్నారు రామ్ లక్ష్మణ్.
కాగా రామ్ లక్ష్మీణ్ లకు పవన్ తన తదుపరి సినిమాలో ఓ ఫైట్ కంపోజ్ చేసే ఛాన్సిచ్చాడంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ ప్రస్తుతం జయంత్ డైరెక్షన్ లో 'ఖుషిగా" సినిమాలో నటిస్తోన్న సంగతి విదితమే.


Click it and Unblock the Notifications











