»   » పవన్ అభిమాని చర్యను తప్పుబట్టిన రామ్ గోపాల్ వర్మ

పవన్ అభిమాని చర్యను తప్పుబట్టిన రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అద్దంకి రవి అనే అభిమాని దాదాపు 1500 కిలోమీటర్లు పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అద్దంకి రవి చర్యను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. ఇలా చేయడం పనికిమాలిన చర్యగా అభివర్ణించారు.

ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో స్పందిస్తూ పవన్ అభిమాని సైకిల్ పై వచ్చి తన సమయం, శక్తి రెంటిని వృధా చేసుకున్నారు. ఆయన రైలులో వచ్చి ఆ సమయాన్ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తే బావుండేది. పవన్ కూడా ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రోత్సమించ వద్దు. పవన్ అభిమానులు ఎవరు కూడా ఇకపై ఇలా చేయొద్దు. పవన్ ఇచ్చిన ఆలింగనం తోనైనా సైకిల్ పై వచ్చిన అభిమాని మారతాడని ఆశిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ అభిమాలను ప్రేమిస్తాను. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే' అంటూ ట్వీట్ చేసారు.

ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ ఏదో తిక్క తిక్కగా ట్వీట్లు చేసే....రామ్ గోపాల్ వర్మ ఈ సారి పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ఆలోచనలో పడే విధంగా, సమయం విలువను తెలియజేస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. కొంప తీసి పవనిజం నినాదం రామ్ గోపాల్ వర్మలో కూడా మార్పు తెచ్చిందా... ఏమి?

English summary
Pawan is an intensely intelligent responsible leader and am sure that he understands that the cycle guy's act was stupid brainless activity'. Calling himself as Pawan's fans, he advised others to not to indulge in these acts. 'All mindless Pawan Kalyan's fans don't do mindless activities of cycling, swimming etc', said RGV.
Please Wait while comments are loading...