త్వరలో ‘స్టైల్ 2’... అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు చెప్పిన లారెన్స్!

Recommended Video

'Style 2' Movie From Raghava Lawrence Soon ! || Filmibeat Telugu

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2‌తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్‌తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ లేటెస్ట్ మూవీ కాంచన-3 ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రాఘ‌వ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ మూవీని బి.మధు విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాఘవ లారెన్స్ తనకు 'స్టైల్' పార్ట్ 2 తీయాలనే కోరిక ఉందని తెలిపారు.

త్వరలో ‘స్టైల్ 2' తీస్తా

త్వరలో ‘స్టైల్ 2' తీస్తా

‘లగడపాటి శ్రీధర్ గారితో గతంలో స్టైల్ సినిమా చేశాను. ఆయన ఇపుడు మాట్లాడుతూ అలాంటిది మరో సినిమా చేయాలని ఉందని చెప్పారు. నాకు కూడా ఆ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఆయన చెప్పగానే స్టైల్ 2 తీయాలనే ఆశ కలిగింది.' అని లారెన్స్తెలిపారు.

అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్

అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్

‘స్టైల్ పార్ట్ 2 చేయాలంటే మంచి డాన్సర్లు కావాలి. తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ బాగా డాన్స్ చేస్తారు. అన్నయ్య చిరంజీవి పేరు చెప్పలేదనుకోవద్దు, ఆయన అన్నింటికీ బాస్. స్టైల్ 2 తీసేపుడు పెద్ద హీరోలతో ప్లాన్ చేసి తీస్తాను' అని లారెన్స్ తెలిపారు.

వారి వల్లే ఈ స్థాయిలో...

వారి వల్లే ఈ స్థాయిలో...

నాకు చిరంజీవిగారు ‘హిట్లర్' సినిమాలో డాన్స్ మాస్టర్‌గా ఛాన్స్ ఇవ్వక పోతే నెం.1 డాన్స్ మాస్టర్ అయ్యేవాడిని కాదు. నాగార్జునగారు పిలిచి డైరెక్షన్ అవకాశం ఇవ్వకపోతే డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. అంతకంటే ముందు రజనీకాంత్ నన్ను ఇండస్ట్రీకి తీసుకుని రాకపోతే... నేను ఇక్కడ ఉండే వాడినే కాదని లారెన్స్ చెప్పుకొచ్చారు.

150 మంది పిల్లలకు సర్జరీ చేయించాను

150 మంది పిల్లలకు సర్జరీ చేయించాను

ఇప్పటి వరకు నేను 150 మంది పిల్లలకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించడానికి, నా ఇంట్లో 60 మంది పిల్లలను చదివించడానికి, ఫిజికల్లీ ఛాలెజింగ్ వారికి డాన్స్ నేర్పించడానికి... బేస్ అక్కడ రజనీకాంత్ గారు, ఇక్కడ చిరంజీవిగారు హెల్ఫ్ చేయడమే అని లారెన్స్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X