»   » నా స్కర్టు సైజ్‌ ను బట్టి నేనేంటో ఎవరూ చెప్పలేరు :సోనమ్ కపూర్

నా స్కర్టు సైజ్‌ ను బట్టి నేనేంటో ఎవరూ చెప్పలేరు :సోనమ్ కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ బోల్డ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ రూటే సెపరేటు. స్టార్‌ హీరో తనయ అయినా చాలా బోల్డ్‌గా మాట్లాడేస్తుంది. తన తమ్ముడికి శృంగారంలో టిప్స్‌ చెబుతామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సుందరి. అలాగే హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతోనూ, సెక్సీ లుక్స్‌తోనూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది.

సోనమ్ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గరనుండీ అనేక హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. సోనమ్ కపూర్ చాలా డిఫరెంట్. ఏదైనా టాపిక్ గురించి చాలా నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంటుంది. తను 13 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పి ఆ మధ్య ఇంకో కలకలం రేపింది.

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కురిపించే గ్లామర్ గురించి చెప్పడం చాలా కష్టం. కానీ చెప్పకపోతే మాత్రం.. అల్ట్రా గ్లామర్ అనే పదానికే అన్యాయం జరిగిపోతుందేమో అనిపిస్తుంది. అమ్మడు చేసే అందాల ప్రదర్శన.. ఎప్పటికప్పుడు పీక్ స్టేజ్ కి వెళ్లిపోవడమే ఇందుకు కారణం. తాజాగా ఓ షాంపేన్ కంపెనీ పార్టీ నిర్వహించగా..

Style icon Sonam Kapoor has been featured on the cover of Femina Magazine

ఇందులో సోనమ్ చేసిన రచ్చ మామూలుగా లేదు. డిజైనర్ బ్లాక్ డ్రస్ లో ఈ డస్కీ బ్యూటీ చూపించిన గ్లామర్ నే.. పెద్ద పార్టీ అనేయాలి. ఎటు సైడ్ నుంచి చూపించినా.. అందాల రచ్చతో ఇరగదీసేసింది సోనమ్ కపూర్. క్లీవేజ్ షోలు ఈ భామకు కొత్త కాదు కానీ.. ఒకే సారి ఫ్రంట్ యాంగిల్ నుంచి.. సైడ్ యాంగిల్ నుంచి.. ఎటు నుంచి చూసినా అందాల ప్రదర్శన చేసేసింది. అది అక్కడితో ముగిసిపోలేదు.

తాజాగా సోనమ్ చేసిన 'సెక్స్ కామెంట్స్' బాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఫెమినా 2017 మేగజీన్‌ కవర్‌పేజీపై ఓ సెక్సీ లుక్‌తో దర్శనమిచ్చింది. అంతేకాదు హాట్‌ హాట్‌ కామెంట్లు చేసింది. 'నా స్కర్టు సైజ్‌ నన్ను నిర్వచించలేదు. ఒకవేళ ఎవరైనా నా స్కర్టు సైజ్‌ అధారంగా నన్ను డిఫైన్‌ చేస్తే.. అది వాళ్ల మైండ్‌సెట్‌ను సూచిస్తుంద'ని చెప్పుకొచ్చింది. అలాగే తన స్కర్టు సైజు ఆధారంగానే 'ఈజీ, ఐటెమ్‌, బెహన్‌జీ' అనే పిలుపులు ఉంటాయని చెప్పింది. ఇటీవల ఓ ప్రముఖ నటి కిడ్నాప్‌, అత్యాచారం, అమ్మాయిల వస్త్రధారణపై చర్చల నేపథ్యంలో సోనమ్‌ ఇలా అల్ట్రా గ్లామరస్‌గా ఫోజులిచ్చింది.

English summary
Sonam Kapoor’s bold stand and confession on this Women’s Day 2017 special cover is what all girls need to see right now
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu