పవన్ కళ్యాణ్ కోరిక.. బన్నీ గొప్ప మనసు చాటుకున్నాడు, తిత్లీ బాధితుల కోసం!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోమారు తన గొప్ప మనసు చాటుకున్నాడు. రియల్ గా కూడా తాను హీరోనే అని అల్లు అర్జున్ నిరూపించుకున్నాడు. గత ఏడాది అక్టోబర్ లో తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాని ముంచెత్తింది. ఈ తుఫాన్ కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులుగా మారారు. పంటలు, ఇల్లు ధ్వంసం అయ్యారు. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుఫాను భాదిత ప్రాంతాలని పరిశీలించారు.

పవన్ కళ్యాణ్ కోరిక
పవన్ కళ్యాణ్ తిత్లీ భాదితులని పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోలంతా తుఫాన్ భాదిత ప్రాంతాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. సినీ హీరోలు ప్రతి ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. టాలీవుడ్ హీరోలు ప్రజల కోసం పని చేయాలని కోరిన సంగతి తెలిసిందే.

గొప్ప మనసు చాటుకున్నాడు
కాగా పవన్ కళ్యాణ్ కోరిక మేరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. తుఫాన్ భాదిత ప్రాంతంలోని అమలపాడు గ్రామపంచాయతీకి బన్నీ మినరల్ వాటర్ ప్లాంట్ ని అందించబోతున్నాడు. ఈ ప్లాంట్ కు సంబంధించిన నిర్మాణం గురువారం అల్లు అర్జున్ అభిమానులు, జనసేన కార్యకర్తల సమక్షంలో ప్రారంభం కాబోతోంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ అందించనున్నారు.

కేరళకు అండగా
గత ఏడాది కేరళ రాష్ట్రాన్ని కూడా వరదలు అతలాకుతలం చేశాయి. ఆ సమయంలో కూడా బన్నీ పెద్ద మొత్తంలో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించాడు. అల్లు అర్జున్ కేరళ వరదబాధితుల సహాయం కోసం రూ 25 లక్షలు డొనేట్ చేశాడు. కేరళలో కూడా భారీ అల్లు అర్జున్ అభిమానులని సంపాదించుకున్నాడు. కేరళ అభిమానులు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తారు.

రాంచరణ్ కూడా
తాను రాంచరణ్ లాంటి హీరోలందరిని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేలా రిక్వస్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో తెలిపారు. ఆ సమయంలో వెంటనే స్పందించన రాంచరణ్ తాను ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించాడు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తానని చరణ్ తెలిపాడు. మరి మెగా పవర్ స్టార్ తన వంతు సాయాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











