Don't Miss!
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కళ్యాణ్‌ను చూడటం మానేశాను: ‘విజేత’ విజయోత్సవంలో అల్లు అర్జున్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మించిన చిత్రం విజేత. రజని కొర్రపాటి నిర్మాత. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. జులై 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి కలెక్షన్లతో దూసుకెళుతుండటంతో ఆదివారం విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అల్లుడు గారూ...
కళ్యాణ్‌ను ‘మా అల్లుడు గారు' సంభోదిస్తూ అల్లు అర్జున్ తన స్పీచ్ మొదలు పెట్టారు. మా మామయ్యకు అల్లుడు అయినా మా ఫ్యామిలీ మొత్తానికి ఆయన చాలా క్లోజ్. కళ్యాణ్ మాకు చాలా స్పెషల్ అని బన్నీ చెప్పుకొచ్చారు.
తెరపై కళ్యాణ్‌ను చూడటం మానేశాను
కళ్యాణ్ నాకు పర్సనల్‌గా తెలుసు కాబట్టి తన ఫస్ట్ సినిమా ఎలా చేస్తాడో అనే చిన్న భయం ఉండేది. ఎమోషనల్ సీన్స్ వస్తే ఎలా? మిగతా సీన్స్ మేనేజ్ చేయవచ్చు కానీ ఎమోషనల్ సీన్స్ మేనేజ్ చేయలేం. సినిమా చూస్తున్నపుడు కళ్యాణ్ ను బాగా గమనించాను. సీన్లు పాసవుతూ ఉన్నాయి. అలా వెళ్లగా వెళ్లగా ఫాదర్‌ను పట్టుకుని ఆటోలో ఏడ్చే సీన్ వచ్చేసరికి నేను కళ్యాణ్ ను చూడటం మనేశాను. నాకు క్యారెక్టరే కనిపించింది. తొలి సినిమా అయినా చాలా బాగా చేశాడు.. అని బన్నీ వ్యాఖ్యానించారు.
ఒక విధంగా చిరంజీవిగారి మీద నా ఇష్టాన్ని చూపిస్తున్నాను
ఫ్యామిలీలో కళ్యాణ్ అంటే అందరికీ చాలా ఇష్టం. అతడు చాలా స్పెషల్. ఒక కొత్త సినిమా విడుదలైనపుడు మనకు ఎవరైనా సపోర్టు చేస్తే బావుంటుంది అనిపిస్తుంది. సినిమాను నెక్ట్స్ లెవరల్కి పుష్ చేయాల్సిన సమయం అది. నాకు అలాంటి అవకాశం వచ్చింది. నాకు చిరంజీవిగారంటే చాలా ఇష్టం. ఒక విధంగా చిరంజీవిగారి మీద నా ఇష్టాన్ని ఈ విధంగా చూపిస్తున్నాను.... అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
తన కొడుకు వీడియోను చూపించిన బన్నీ
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కొడుకు ఈ సినిమాలోని పాటను ఎంత ఇష్టపడుతున్నాడో వెల్లడిస్తూ ఓ వీడియో చూపించారు.