twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్యాణ్‌ను చూడటం మానేశాను: ‘విజేత’ విజయోత్సవంలో అల్లు అర్జున్ కామెంట్స్

    By Bojja Kumar
    |

    మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మించిన చిత్రం విజేత. ర‌జ‌ని కొర్రపాటి నిర్మాత‌. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌ సంగీతం అందించారు. జులై 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి కలెక్షన్లతో దూసుకెళుతుండటంతో ఆదివారం విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    అల్లుడు గారూ...

    అల్లుడు గారూ...

    కళ్యాణ్‌ను ‘మా అల్లుడు గారు' సంభోదిస్తూ అల్లు అర్జున్ తన స్పీచ్ మొదలు పెట్టారు. మా మామయ్యకు అల్లుడు అయినా మా ఫ్యామిలీ మొత్తానికి ఆయన చాలా క్లోజ్. కళ్యాణ్ మాకు చాలా స్పెషల్ అని బన్నీ చెప్పుకొచ్చారు.

    తెరపై కళ్యాణ్‌ను చూడటం మానేశాను

    తెరపై కళ్యాణ్‌ను చూడటం మానేశాను

    కళ్యాణ్ నాకు పర్సనల్‌గా తెలుసు కాబట్టి తన ఫస్ట్ సినిమా ఎలా చేస్తాడో అనే చిన్న భయం ఉండేది. ఎమోషనల్ సీన్స్ వస్తే ఎలా? మిగతా సీన్స్ మేనేజ్ చేయవచ్చు కానీ ఎమోషనల్ సీన్స్ మేనేజ్ చేయలేం. సినిమా చూస్తున్నపుడు కళ్యాణ్ ను బాగా గమనించాను. సీన్లు పాసవుతూ ఉన్నాయి. అలా వెళ్లగా వెళ్లగా ఫాదర్‌ను పట్టుకుని ఆటోలో ఏడ్చే సీన్ వచ్చేసరికి నేను కళ్యాణ్ ను చూడటం మనేశాను. నాకు క్యారెక్టరే కనిపించింది. తొలి సినిమా అయినా చాలా బాగా చేశాడు.. అని బన్నీ వ్యాఖ్యానించారు.

    ఒక విధంగా చిరంజీవిగారి మీద నా ఇష్టాన్ని చూపిస్తున్నాను

    ఒక విధంగా చిరంజీవిగారి మీద నా ఇష్టాన్ని చూపిస్తున్నాను

    ఫ్యామిలీలో కళ్యాణ్ అంటే అందరికీ చాలా ఇష్టం. అతడు చాలా స్పెషల్. ఒక కొత్త సినిమా విడుదలైనపుడు మనకు ఎవరైనా సపోర్టు చేస్తే బావుంటుంది అనిపిస్తుంది. సినిమాను నెక్ట్స్ లెవరల్‌కి పుష్ చేయాల్సిన సమయం అది. నాకు అలాంటి అవకాశం వచ్చింది. నాకు చిరంజీవిగారంటే చాలా ఇష్టం. ఒక విధంగా చిరంజీవిగారి మీద నా ఇష్టాన్ని ఈ విధంగా చూపిస్తున్నాను.... అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

    తన కొడుకు వీడియోను చూపించిన బన్నీ

    ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కొడుకు ఈ సినిమాలోని పాటను ఎంత ఇష్టపడుతున్నాడో వెల్లడిస్తూ ఓ వీడియో చూపించారు.

    English summary
    Stylish Star Allu Arjun Fantastic Speech at Vijetha Movie Vijayotsavam. Vijetha, starring Kalyan Dhev and Malavika Nair. The romantic action entertainer that has all the elements to impress the family audience. The movie has been produced by Sai Korrapati under the banner Vaaraahi Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X