twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ తర్వాత అల్లు అర్జున్ వంతొచ్చింది...!

    By Sindhu
    |

    'మగధీర" చిత్రంలో రామ్‌ చరణ్ కత్తిపట్టుకొని యోధునిగా శత్రువులను చీల్చిచెండాడిన సన్నివేశాలు గుర్తున్నాయిగా..! ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వంతొచ్చింది. ఈ స్టైలిష్‌ స్టార్ కూడా కండలు తిరిగిన శరీర సౌష్టవంతో.. కత్తి పట్టుకొని యోధునిగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. వివి వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'బద్రినాథ్"లో అర్జున్ యోధునిగా కనిపించనున్నాడు. అయితే ఇది సోషియో ఫాంటసీ బ్యాక్‌ డ్రాప్ కాదని దర్శకుడు చెబుతున్నారు.

    తమన్నానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలను మే 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ఎమ్.ఎమ్. కీరవాణి ఇంతకు ముందు మా సంస్థలో గంగోత్రి, మగధీర చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా చాలా చక్కని సంగీతాన్ని ఇచ్చారు.

    మేలోనే ఆడియోతో పాటు చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. చిన్నికృష్ణ అందించిన ఒక విభిన్న కథతో రూపొందిస్తున్న చిత్రమిది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది" అన్నారు. ప్రకాష్‌రాజ్, కెల్లీ డోర్జ్, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్, కృష్ణ భగవాన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: చిన్నికృష్ణ.

    English summary
    Allu Arjun’s Badrinath has completed its shooting and is busy in wrapping up the post production program.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X