స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘వరుడు’ లోగో విడుదల!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ల సూపర్ కాంబినేషన్ లో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'వరుడు" రెండు పాటలు మినహా పూర్తయింది. వేసవి విడుదలకు శరవేగంగా షూటింగ్ ను జరుపుకొంటోంది. జనవరి 22న 'వరుడు" చిత్రం లోగోని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ 'స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారితో 'దేశముదురు" లాంటి సూపర్ హిట్ తర్వత మా బేనర్ లో నిర్మిస్తున్నరెండవ చిత్రం 'వరుడు" నిర్మాణం దాదాపుగా పూర్తయింది. అల్లు అర్జున్ ని దర్శకులు గుణశేఖర్ 'వరుడు" గా కొత్త డైమెన్షన్ లో చూపిస్తున్నారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ 'అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ 'వరుడు" లో హైలైట్ అవుతుంది. అలాగే విలన్ గా తమిళ హీరో ఆర్య అద్భుతంగా చేసాడు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాం.
దాదాపు 100 కుటుంబాలకు పైగా తమ కుటుంబ సభ్యులందరితో కలిసి 'వరుడు" లో నటించడం ఓ విశేషం. అలాగే ఈ చిత్రంలోని అన్ని పాటల్ని వేటూరిగారు అద్భుతంగా రాసారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో వుంటూ విజువల్ గ్రాండియర్ తో అందర్నీ ఆకట్టుకునే చిత్రం అవుతుంది" అన్నారు. భారీ ఎత్తున నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో తమిళ్ హీరో ఆర్య విలన్ పాత్రలో, అల్లు అర్జున్ తల్లిగా సుహాసిని ప్రదాన పాత్రలు పోషించారు. ఇంకా నరేష్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ లతో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా నిర్మితమవుతున్న 'వరుడు" చిత్రానికి వేటురి గారి రచనలకి మణిశర్మ చాలా చక్కటి సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











