అల్లు అర్జున్ బర్త్‌డేకి అర ఎకరా సరిపోదు.. హైదరాబాద్‌లో రేట్లు, నా వల్ల కాదంటున్న బన్నీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. హీరో నవదీప్ సి స్పేస్ సంస్థని లాంచింగ్ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సి స్పేస్ ప్రాముఖ్యతని వివరించారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి విభిన్న ఆలోచనలకు అంతా శ్రీకారం చుట్టాలని బన్నీ కోరారు. ఇలాంటి సంస్థల్ని ప్రారంభించే వారిని ప్రోత్సహించాలని అన్నారు. అల్లు అర్జున్ తనకు నవదీప్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు.

ఇద్దరం పబ్బుల్లోనే

ఇద్దరం పబ్బుల్లోనే

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నవదీప్. బావ అని పిలుస్తుంటా. ఇద్దరం ఎప్పుడూ పబ్బుల్లోనే కలుస్తుంటాం అని అల్లు అర్జున్ తెలిపాడు. సినిమాల పరంగా కాకుండా నవదీప్ వ్యక్తిగతంగా ఎందుకు ఇష్టమో అల్లు అర్జున్ వివరించారు. చెన్నై వరదల సమయంలో అందరూ ఎంతోకొంత సాయం చేశారు. నేను కూడా కొంత సాయం అందించాను. కానీ నవదీప్ మాత్రం చిత్ర పరిశ్రమ నుంచి సేకరించిన సామాగ్రిని తానే స్వయంగా చెన్నైకి తీసుకుని వెళ్లి వరద బాధితులకు అందించాడని అల్లు అర్జున్ తెలిపాడు.

ఇండియాలోనే ఫస్ట్

ఇండియాలోనే ఫస్ట్

ఇక సి స్పేస్ గురించి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో అనేక విభాగాలలో రాణించాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. కానీ వారందరికీ తమ ప్రతిభని ఎలా నిరూపించుకోవాలో తెలియదు. అలాంటి వారందరి కోసం నవదీప్ ఈ సి స్పేస్ ప్రారంభించాడనిబన్నీ తెలిపాడు. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు. అన్న పూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఫిలిం స్కూల్ ని నడిపిస్తున్నారు. ఇలా చిత్ర పరిశ్రమలో ఎక్కువమంది ప్రతిభావంతులని వెలుగులోకి తీసుకువచ్చే సంస్థలు రావాలని బన్నీ ఆకాంక్షించాడు. నవదీప్ మాట్లాడుతూ.. ఈ సి స్పేస్ సంస్థ ఇండియాలోనే ఫస్ట్ మీడియా ఇంక్యుబేటర్ అని తెలిపాడు.

ఫామ్ హౌస్‌లో పార్టీ

ఫామ్ హౌస్‌లో పార్టీ

దర్శకుడు హరీష్ శంకర్ గురించి బన్నీ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఏ కార్యక్రమం జరిగినా మొదట చొరవ తీసుకునే వ్యక్తి హరీష్ శంకర్ అని తెలిపాడు. మహానటి విడుదలై విజయం సాధించినప్పుడు ఆ సినిమా గురించి మేమిద్దరం మాట్లాడుకున్నాం. అశ్విని దత్, అల్లు అరవింద్ చాలా కాలంగా పార్ట్నర్స్. చిత్ర యూనిట్ కి మీరు పార్టీ ఇస్తే ఇలా ఉంటుంది అనే సలహాని తనకు ఇచ్చింది హరీష్ శంకరే అని బన్నీ తెలిపాడు. మీరు ఫామ్ హౌస్ లో పార్టీ ఏర్పాటు చేస్తే మహానటి చిత్రాన్ని ప్రోత్సహించినట్లు ఉంటుంది. అశ్విని దత్ గారికి పార్టీ ఇచ్చినట్లు ఉంటుంది అని హరీష్ తనతో చెప్పినట్లు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో వివరించాడు.

బన్నీ బర్త్ డేకి అర ఎకరా సరిపోదు

బన్నీ బర్త్ డేకి అర ఎకరా సరిపోదు

ఇదే కార్యక్రమంలో మొక్కల ప్రాముఖ్యత అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మనం ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పడానికి వెళితే పుష్ప గుచ్చం తీసుకుని వెళతాం. కాసేపటికి ఆ పువ్వులు వాడిపోతాయి. అదే ఒక మొక్కని గిఫ్ట్ గా ఇస్తే అది ఎదుగుతూ ఉంటుంది. అందుకే తనకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఓ మొక్కని ఇవ్వమని చెబుతున్నా. గిఫ్ట్ గా ఇచ్చే మొక్కల కోసం నా ఫామ్ హౌస్ లో మరో అర ఎకరా కొనుగోలు చేశానని బన్నీ తెలిపాడు. దీనిపై నవదీప్ స్పందిస్తూ.. మరో రెండు రోజుల్లో బన్నీ బర్త్ డే ఉంది. ఆ బర్త్ డేకి వచ్చే మొక్కలకు అర ఎకరా సరిపోదు అని నవదీప్ సరదాగా అన్నాడు. దీనికి బన్నీ బదులిస్తూ.. హైదరాబాద్ లో రేట్లు బాగా పెరిగిపోయాయి.. ఇక కొనడం నావల్ల కాదు అని సరదాగా తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X