కాలిబూడిదైన ఊబర్ క్యాబ్... తృటిలో తప్పించుకున్న సమంత-చైతూ స్టైలిస్ట్
సౌత్ సినీ స్టార్స్ సమంత, నాగ చైతన్య, విజయ్, అనిరుధ్ రవిచందర్ లాంటివారికి కాస్టూమ్ డిజైనర్, స్టైలిస్టుగా పని చేసిన పల్లవి సింగ్ ప్రయాణిస్తున్న ఊబర్ క్యాబర్ ఉన్నట్టుండి మంటలు అంటుకుని కాలి బూడిదైంది. ఈ విషయాన్ని పల్లవి సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
ఆమె ప్రయాణిస్తున్న కారు చెన్నైలోని టిటికె రోడ్ ఫ్లైఓవర్ మీదకు వెళ్లగానే ఇంజిన్ నుంచి మంటల వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్ కారు ఆపడంతో అదృష్టవశాత్తు ఆమెతో పాటు, డ్రైవర్ ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా బయటపడ్డారు.

ఊబర్ క్యాబ్ సర్వీస్‌తో జాగ్రత్త
ఊబర్ క్యాబ్ సర్వీస్ ఉపయోగించే వారు జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణికుల సేఫ్టీ గురించి ఊబర్ లాంటి సంస్థలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ఇక్కడ అలాంటిదేమీ కనిపించడం లేదని ఆమె తెలిపారు.

కారుతో పాటు ముఖ్యమైన వస్తువులు బూడిద
నేను నా పని ముగించుకుని ఇంటికి వెళుతున్నాను. కారులో వెళుతుండగా పొగలు వచ్చాయి. ఈ విషయం వెంటనే డ్రైవర్‌కు చెప్పాను. బయట నుంచి కూడా ఇతర వాహన దారులు హెచ్చరించడంతో మేము కారు ఆపి దిగేశాం. ఈ మంటల్లో నా ఐడి, వ్యాలెట్, ఇతర ముఖ్యమైన వాస్తువులు కారుతో పాటు కాలిపోయినట్లు పల్లవి సింగ్ తెలిపారు.

కస్టమర్లపట్ల నిర్లక్ష్యం
ప్రమాదం జరిగి 12 గంటలైనా ఊబర్ సంస్థ దీని గురించి పట్టించుకోలేదు. కష్టమర్లపట్ల వారు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శం. అదృష్ట వశాత్తు నేను ప్రాణాలతో బయట పడ్డాను. ఆ సంఘటన తలుచుకుంటేనే భయం వేస్తోందని పల్లవి సింగ్ వ్యాఖ్యానించారు.
వీడియో షేర్ చేసిన పల్లవి సింగ్
పల్లవి సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసి వీడియో వైరల్ అయింది. ఫ్లైఓవర్ మీద మంటల్లో కాలిబూడిదవుతున్న ఊబర్ క్యాబ్ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఊబర్ ప్రతినిధి స్పందన
ఈ ప్రమాద ఘటనపై ఊబర్ ప్రతినిధి స్పందించారు. డ్రైవర్‌తో పాటు కష్టమర్ ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా బయటపడటం తమకు ఎంతో ఊరటనిచ్చిందని, ఈ సంఘటన గురించి తెలియగానే వెంటనే అక్కడకు తమ బృందం చేరుకుందని, దీన్ని వెంటనే దృష్టికి తెచ్చినందుకు డ్రైవర్, కస్టమర్‌ను అభినందిస్తున్నాం. వినియోగదారుల సేఫ్టీకి తమ సంస్థ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. చట్టపరంగా అన్ని విధాలుగా తమ సహకారం ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications











