twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుబ్బరాజు హీరోగా ‘జయహే’ మార్చిలో

    By Bojja Kumar
    |

    హీరో పర్సనాలిటీకి ఏమాత్రం తీసిపోకుండా ఉండే నటుడు సుబ్బరాజు. ఇంతకాలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో కనిపించిన సుబ్బరాజు త్వరలో 'జయహే' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సుధీర్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుదీప్, రామకృష్ణ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    సుబ్బరాజు ఈ చిత్రంలో నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. బ్రహ్మాజీ, శివాజీరాజా, ఎంఎస్ నారాయణ, జీవా, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిన్ని చరణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విజయభాస్కర్ చౌదరి లియో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: వెంకట్, ఎడిటింగ్: నందమూరి హరి

    ఈ చిత్రంతో పాటు 'అజ్ఞాతం' అనే చిత్రంలోనూ సుబ్బరాజు హీరోగా నటిస్తున్నాడు. పోకూరు సుధీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.వి.ఎస్. రావు శ్రీకామాలయ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీప్తి ప్రియ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

    English summary
    Subbaraju will soon be seen as a hero in the movie ‘Jayahe’. The movie has completed its censor formalities and the movie is gearing up for a release in the first week of March. The movie has been directed by Sudhir Raj. Sandeep and Ramakrishna have jointly produced this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X