దాసరి జన్మ ధన్యం.. ఎందరో గుండెల్లో ఆయన.. సుబ్బిరామిరెడ్డి
Recommended Video

దాసరి జన్మ ధన్యం.. -సుబ్బిరామిరెడ్డి
దర్శకరత్న దాసరి నారాయణ రావు పైన ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రూపొందించిన 'తెరవెనుక దాసరి' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నాడు సిని ప్రముఖులు, దాసరి శిష్యులు, దాసరి కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, మురళి మోహన్, ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు పలువురు రాసిన వ్యాసాల సంకలనంగా ఈ పుస్తకం రూపొందింది.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత టీ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. మానవ జీవితంలో దాసరి నారాయణరావు జన్మ ధన్యం. మరణించిన తర్వాత కూడా ఇంకా ఎందరో గుండెల్లో నిలిచిపోయారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందరో ఆత్మీయులను సంపాదించుకోవడం అసాధారణం. ఏది ఏమైనా ఆయనతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉండేది అని సుబ్బిరామి రెడ్డి అన్నారు.
More from Filmibeat
dasari narayana rao megastar chiranjeevi allu aravind t subbarami reddy దాసరి నారాయణరావు మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ టి సుబ్బిరామిరెడ్డి


Click it and Unblock the Notifications











