ఐస్‌లాండ్‌లో శుభలేఖ రాయనున్న రామ్ చరణ్

By Bojja Kumar

హైదరాబాద్ : చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలో 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో ' ఇళయరాజా సంగీతం అందించిన ఈ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ పాటను రామ్ చరణ్ హరోగా వి.వి.వినాయక్ దర్శకత్వం లో రూపొందుతున్న 'నాయక్' చిత్రంలో రీమిక్స్ చేస్తున్నారు.

ఈ సాంగు చిత్రీకరణ ఆగస్టు 22 నుంచి ఐస్ లాండ్ ద్వీపంలో జరుగనుంది. తొలత ఈ పాటను కాజల్‌తో చిత్రీకరించాలని భావించినప్పటికీ చివరకు అమపాల్‌తో చిత్రీకరించాలని నిర్ణయించాడు దర్శకుడు. సంగీత దర్శకుడు తమన్ కు ఎంతో ఇష్టమైన ఈ పాటను విపరీత సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చక్కనైన మెలోడి సాంగ్ గా కంపోజ్ చేస్తున్నారు . చిరంజీవి హిట్ సాంగ్స్ రీమిక్స్ చేసిన రెండు చిత్రాలు 'మగధీర', 'రచ్చ' ఘన విజయం సాధించాయి. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు కుడా వర్క్ అవుట్ అయ్యి చరణ్ కు ఈ చిత్రం మరో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు.

బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌, నిర్మాత : డివివి దానయ్య, దర్శకత్వం : వివి వినాయక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X