'శుఖలేఖ రాసుకున్నా..' లో చరణ్ తో స్టెప్స్ వేసేదెవరంటే..
హైదరాబాద్: చిరంజీవి 'కొండవీటి దొంగ' చిత్రంలోని 'శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో.. అనే పాటని రామ్ చరణ్ తాజా చిత్రం నాయక్ లో రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటలో డాన్స్ చేసే అవకాశం అమలా పాల్ కి ఈహించని విధంగా దక్కింది. రామ్ చరణ్ 'నాయక్'లో ''శుఖలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో'' అనే పాటలో అమలా పాల్ డాన్స్ చేయనుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ సోమవారం నుంచి గ్రీసులో మొదలైంది. కాగా పైపాటను తొలుత రామ్ చరణ్, కాజల్‌పై తియ్యాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు కాజల్‌కు బదులుగా ఆ అవకాశం అమలాపాల్‌ను వరించటంతో ఆమెచాలా హ్యాపీగా ఉంది.
డివీవీ దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే కోల్‌కత్తాలో పూర్తయింది. అక్కడ రామ్‌చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ గ్రీస్‌లో జరగుతోంది. అక్కడ రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, అమలాపాల్ తోపాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్‌లపై అక్కడి అందమైన ప్రదేశాల్లో పాటలు చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరుగుతుందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి నాయక్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అలాగే ఈ టైటిల్ కి ట్యాగ్ లైన్ గా ది లీడర్ అని పెట్టారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం జిలేబి అనే పాత్రలో కనిపించి అలరించనున్నారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది. బ్రహ్మానందం, జయప్రకాష్‌డ్డి, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, రాహుల్‌దేవ్, ప్రదీప్‌రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోట.కె. నాయుడు, కథ,మాటలు: ఆకుల శివ, నిర్మాత: డివీవీ దానయ్య, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











