హార్ట్ ఎటాక్ తో హాస్టటల్లో స్టార్ డైరక్టర్
బాలీవుడ్ స్టార్ డైరక్టర్ సుభాష్ ఘయ్ హార్ట్ ఎటాక్ తో హాస్పటిల్ లో చేరినట్లు సమాచారం. ఆయన్ను ఆసియా హార్ట్ ఇనిస్టిట్యూట్ ఐసియు సెక్షన్ లో ఎడ్మిట్ చేసి వైధ్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ఈ హాస్పటిల్ లో గత కొద్ది రోజులుగా ఆయన్ను ఉంచి ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు లీడింగ్ ఇంగ్లీష్ డైలీ ఇవాళ రాసుకొచ్చింది. అయితే దీన్ని అఫిషయల్ గా ధృవీకరించటం లేదు. అయితే హాస్పటిల్ వర్గాలు ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేసాయి. అయితే మిగతా వివరాలు తెలియబరచటానికి వారు నిరాకరించారు. ఇక సుభాష్ ఘయ్ కుటుంబ సబ్యులు కూడ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. సుభాష్ ఘయ్ గతంలో తాళ్, కర్జ్, పరదేశ్, యాదిన్ వంటి అనేక సూపర్ హిట్స్ ని ఇచ్చారు. ఆయన సంవత్సరం క్రితం సల్మాన్ ఖాన్, అనీల్ కపూర్ తో చేసిన యువరాజ్ చిత్రంభాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆయన ఏ చిత్రమూ డైరక్ట్ చేయలేదు. తన ముక్తా ఆర్ట్స్ పైనే ఆయన సినిమాలు నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











