పవన్ లాగ...:‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ టీజర్ (వీడియో)
హైదరాబాద్: మొన్నీ మధ్యనే పిల్లా నువ్వు లేని జీవితం అంటూ హిట్ కొట్టిన ...సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమై హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చెసింది. ఈ టీజర్ లో సాయి ధరమ్ తేజ..పవన్ కళ్యాణ్ లాగ అనిపించారు. కావాలని చేసారో లేక దానంతట అదే బాడీ లాంగ్వేజ్ వచ్చిందో మరి.. మీరూ ఆ టీజర్ ని మీరూ ఓ లుక్కేయండి.
సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. ఇండియాలోని పలు ప్రాంతాల్లో షూట్ చేయనున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ని ఏప్రిల్ లో అమెరికాలో షూట్ చేయనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
''ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన 'రామయ్య వస్తావయ్యా' అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు'' అని 'దిల్' రాజు అన్నారు.

అలాగే ..'దిల్' రాజు మాట్లాడుతూ - ''సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి మార్చి వరకూ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుతాం. ఏప్రిల్ నుంచి అమెరికాలో షూటింగ్ ఉంటుంది. వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు. '''మిరపకాయ్' టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను.
అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. 'గబ్బర్‌సింగ్' టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది'' అని హరీశ్‌శంకర్ తెలిపారు.
సాయిధరమ్‌తేజ్. సుమన్, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్, పృథ్వీ, ప్రభాస్ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్ వేగేశ్న, తోట ప్రసాద్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్ ఎస్


Click it and Unblock the Notifications











