ట్విట్టర్ రివ్యూ : సుబ్రహ్మణ్యపురం.. సుమంత్ చేధించే మిస్టరీ!
హీరో సుమంత్ ప్రస్తుతం సినిమాల స్పీడు పెంచాడు. మళ్ళిరావా చిత్రంతో ట్రాక్ లోకి వచ్చిన సుమంత్ ఇప్పుడు సుబ్రహ్మణ్యపురం, ఇదమ్ జగత్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన సుబ్రహ్మణ్యపురం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ గ్రామం.. అందులో ఉన్న దేవాలయం చుట్టూ జరిగే మిస్టరీ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సుమంత్ సరసన తెలుగు భామ ఇషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తోంది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సోషల్ మీడియాలో సందడి ఎలా ఉందో చూద్దాం!
బ్రో ఆల్ ది బెస్ట్
అక్కినేని యువ హీరో అఖిల్ సుబ్రహ్మణ్యపురం చిత్ర విడుదల సందర్భంగా సుమంత్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. బ్రో ఆల్ ది బెస్ట్.. ఈ చిత్రం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది అంటూ ట్వీట్ చేశాడు.
సుమంత్ విజయం సాధించాలి
సుమంత్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకోవాలి. ఇషా రెబ్బ విభిన్నమైన పాత్రలో నటిస్తోంది. మొత్తంగా సుబ్రహ్మణ్యపురం చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇషా రెబ్బ కోసం
నేను సుబ్రహ్మణ్యపురం చిత్రాన్ని ఇషా రెబ్బ కోసం చూస్తాను.
మీ నుంచి మరిన్ని చిత్రాలు
నేను ఇషా రెబ్బ అభిమానిని. మీ నుంచి ఇంకా మరిన్ని చిత్రాలు రావాలని కోరుకుంటున్నా.
షో పడింది
ఇప్పుడే సుబ్రహ్మణ్యపురం చిత్రం చూశా. అర్థం కాని విధంగా సినిమా ఉంది.
పెద్ద సినిమాలు లేవు
ఈ వారం టాలీవుడ్ లో పెద్ద చిత్రాలేవీ విడుదుల కావడంలేదు. సుబ్రహ్మణ్యపురం, నెక్స్ట్ ఏంటి, కవచం చిత్రాలు విడుదలవుతున్నాయి.
కథని సరైన దారిలో
సుబ్రహ్మణ్యపురం చిత్రంలో దర్శకత్వలోపం కనిపిస్తోంది. దర్శకుడు కథని సరైన దారిలో మలచలేదు.


Click it and Unblock the Notifications











