సల్మాన్, షారుక్, అమీర్ ఆస్తులపై సీబీఐ విచారణ.. సుబ్రమణ్యస్వామి డిమాండ్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. దేశ, విదేశాల్లో ఉన్న వారి ఆస్తులపై విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
సుశాంత్ సింగ్ సూసైడ్ గురించి మాట్లాడకుండా మౌనం దాల్చడంపై సుబ్రమణ్యస్వామి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు ఖాన్ల ముసుగులు తొలగించాలంటే విదేశాల్లో ఉన్న వారి ఆస్తులను, ముఖ్యంగా దుబాయ్లోని వారి ఆస్తులపై విచారణ చేయించాలి. వారికి ఆ ఆస్తులను ఎవరు బహుమతిగా ఇచ్చారనే విషయాన్ని బయటపెట్టాలి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. కాబట్టి వారి ఆస్తులను సిట్, ఈడీ, ఐటీ, సీబీబీ సంస్థలతో విచారణ జరిపించాలి అని ఆయన తన ట్వీట్‌లో డిమాండ్ చేశారు.

సుశాంత్ మరణంపై విచారణ జరిపించాలని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, ఎంపీ, నటి రూపా గంగూలితోపాటు నెటిజన్లు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. కర్ణిసేన లాంటి సంస్థలు ఉద్యమాలు చేయడానికి ముందుకొచ్చాయి. ఇలాంటి తరుణంలో సుబ్రమణ్యస్వామి బాలీవుడ్ అగ్రహీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఆస్తుల టార్గెట్ చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది.
జూన్ 14వ తేదీను సుశాంత్ సూసైడ్ చేసుకొన్న తర్వాత ఈ కేసులో దాదాపు 35 మందిని ముంబై పోలీసులు ప్రశ్నించారు. పలువురిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు పిలిచి గంటల తరబడి ప్రశ్నల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











