twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజని అభిమానుల ఆగ్రహం: సామాజిక మాధ్యమాల్లో విమర్శల వెల్లువ

    సామాజిక మాధ్యమాల్లో రజని అభిమాన గ్రూప్స్, ప్రపంచ రజనీ అభిమాన సంఘం, తదితర సంఘాల పేరిట సుబ్రహ్మణ్య స్వామిపై దండయాత్ర చేసినట్టు మాటల దాడి చేస్తూనే ఉన్నారు.

    |

    దక్షిణ భారత చలనచిత్ర సూపర్‌ స్టార్‌ రాజకీయ ఆరంగ్రేటంపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. తలైవా వస్తారన్న ఆశతో ఎదురుచూసే వాళ్లు, వ్యతిరేకించే వాళ్లు ఒకే స్థాయిలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రజనీని ఉద్దేశించి బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

    ర‌జ‌నీకాంత్ ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ు

    ర‌జ‌నీకాంత్ ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ు

    ర‌జ‌నీ నిర‌క్ష‌రాస్యుడ‌ని, అత‌ను రాజ‌కీయాల‌కు అన్‌ఫిట్ అని బీజేపీ ఎంపీ అన్నారు. హీరో ర‌జ‌నీకాంత్ ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, అత‌ను రాజ‌కీయాల్లో చేర‌రాదు అన్నట్టు సుభ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలకి పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామి మాట్లాడుతూ..

    రజనీ పాల్పడిన ఆర్థిక అవకతవకలు

    రజనీ పాల్పడిన ఆర్థిక అవకతవకలు

    రాజకీయాల్లోకి రావాలన్న రజనీ ఆకాంక్షలకు ఆయన పాల్పడిన ఆర్థిక అవకతవకలు అడ్డుపడతాయన్నారు. ఆ వివరాలు బయటకు వస్తే రజినీ రాజకీయాల్లోకి కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. మీడియా ఎంతో గొప్పగా చెబుతున్న ఆయన ఇమేజ్ పూర్తిగా కుప్పకూలిపోతుందని చెప్పారు.

    మీరు రాజకీయాల్లోకి రాకండి

    మీరు రాజకీయాల్లోకి రాకండి

    'మీరు రాజకీయాల్లోకి రాకండి' అని రజినీకాంత్‌కు స్వామి హితవు పలికారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని బీజేపీ, రాజకీయాల్లోకి రజినీలాంటి మంచి వ్యక్తులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల స్వాగతించిన నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి

    కోపంతో రగిలి పోయారు

    కోపంతో రగిలి పోయారు

    ఆ మాటలు విన్న వెంటనే రజినీ అభిమానులు కోపంతో రగిలి పోయారు, ఆందోళనతో తమ ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు నిర్ణయించినా, తలైవా అభిమానం వారిని కట్టిపడేసింది. తనను విమర్శించే వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయకూడదని కథానాయకుడు విధించిన ఆంక్షలతో అభిమాన సేనలు వెనక్కుతగ్గారు.

    సామాజిక మాధ్యమాల్లో

    సామాజిక మాధ్యమాల్లో

    అయితే, సామాజిక మాధ్యమాల్లో స్వామిపై దాడికి దిగడం గమనార్హం. ఒకరూ ఇద్దరూ కాదు వేల సంఖ్యలో ట్వీట్లు ఇంకా పడుతూనే ఉన్నాయి. అభిమానులు తమ ఆగ్రహాన్ని ఆందోళనతో కాకుండా ట్విట్లతో చూపించారు. ఫేస్‌ బుక్, ట్విటర్‌ వంటి తలైవా సేనల్లో ఆక్రోశం సామాజిక మాధ్యమాల్లో రజని అభిమాన గ్రూప్స్, ప్రపంచ రజనీ అభిమాన సంఘం, తదితర సంఘాల పేరిట స్వామిపై దండయాత్ర చేసినట్టు మాటల దాడి చేస్తూనే ఉన్నారు.

    బీజేపీతో చేతులు కలపాలని

    బీజేపీతో చేతులు కలపాలని

    మరి కొందరు అభిమానులు అసలు బీజేపీ లోకి రజినీ ని రమ్మని ఆహ్వానించిన పెద్దల జాడెక్కడా? అంటూ పెరశ్నించారు.. రజినీ రాజకీయాల్లోకి రావాలని, బీజేపీతో చేతులు కలపాలని పదేపదే పిలుపు నిస్తున్న ఆ పెద్దలు, సుబ్రహ్మణ్య స్వామిని కట్టడి చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నారని మండి పడ్డారు.

    హిందూ మక్కల్‌ కట్చి నేత

    హిందూ మక్కల్‌ కట్చి నేత

    నిజంగా రజనీ మీద అభిమానం ఉంటే, సుబ్రహ్మణ్య స్వామిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఇక, హిందూ మక్కల్‌ కట్చి నేత అర్జున్‌ సంపత్‌ ఒక అడుగు ముందుకు వేసి తస్మాత్‌ జాగ్రత్త అన్న హెచ్చరికతో ప్రత్యేక ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. ఇక నైనా, రజనీని విమర్శించడం మానుకోకుంటే, స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు

    English summary
    Subramanian Swamy stoked a fresh controversy by saying Rajinikanth is an “illiterate and unfit for politics”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X