సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ షురూ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: తొలి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తర్వాతి సినిమా మొదలైంది. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రానికి హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇంతకు ముందు చిత్రంలో సాయి ధరమ్ తేజతో రొమాన్స్ చేసిన రెజీనా....ఈ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, మరో అతిథి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసారు. వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ...‘రామయ్యా వస్తావయ్యా తర్వాత హరీష్ శంకర్ తో చేస్తున్న చిత్రం ఇది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. డిసెంబర్ నుండి హైదరాబాద్ లో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ లో యూఎస్ షెడ్యూల్ పూర్తి చేసి వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇది మాస్ అండ్ కామెడీ ఎంటర్టెనర్. పవన్ కళ్యాణ్ కి తొలి ప్రేమ, బన్నికీ ఆర్య ఎంత పెద్ద హిట్టయిందో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సాయి ధరమ్ తేజకి అంత పెద్ద హిట్టవుతుంది ' అన్నారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ....

హరీష్ శంకర్ మాట్లాడుతూ....


మిరపకాయ్ అయిన తర్వాత ఈ కథ చేద్దామనుకున్నాను. రేయ్, పిల్లా నువ్వు లేని జీవితం ప్రోమోలు చూసిన తర్వాత ఈ కథ తేజకి సెట్టవుతుందని ఫిక్స్ అయ్యాను అన్నారు.

కమర్షియల్ హీరో

కమర్షియల్ హీరో


ఈ సినిమాలో సాయి ధరమ్ తేజను ఫుల్ లెంగ్త్ కమర్షియల్ హీరోగా చూపిస్తాను. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. తేజ్ పెద్ద స్టార్ అవుతాడనే నమ్మకం ఉంది అన్నారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.....

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.....


ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది. కెరీర్ కి ప్లస్ అవుతుంది. నాతో రెండో సినిమా తీస్తున్నందుకు దిల్ రాజు గారికి థాంక్స్ అన్నారు.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రెజీనా, సుమన్, కోట శ్రీనివాసరావు, నాగ బాబు, రావు రమేష్, పృథ్వి, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: గౌతం రాజు, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, వెంకట్, ఆర్ట్: రామకృష్ణ, స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, తోట ప్రసాద్, కో ప్రొడ్యూసర్స్: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X